హీరో ‘ఫహాద్ ఫాజిల్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా, మలయాళ స్టార్ హీరోల్లో ఫహాద్ ఫాజిల్ కూడా ఒకరు. అయితే పేరుకు మలయాళ నటుడు అయినా ఫహాద్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ఈయన మలయాళంతో పాటు తమిళ్, తెలుగు వంటి భాషల్లో నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా.. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో తెలుగు తెరపై విలన్ గా ఎంట్రీ ఇచ్చి అందర్నీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. కాగా, ఇటీవలే ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ సినిమా మంచి సూపర్ హిట్ గా నిలిచి మంచి విజయాన్ని అందుకుంది.ఇదిలా ఉంటే..తాజాగా ఈ హీరో చాలా కమర్షియల్ అయిపోయాడని, పైగా ఎంతలా అంటే.. ఒక్క రోజుకు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళ్తే..
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ మంచి జోష్ లో దూసుకుపోతున్నాడు. నిజానికి ఫాహాద్ ఫాజిల్ మూవీస్ ను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఈ కావాలనే.. ప్రతి నాలుగు నెలలకు ఒక సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక అందుకు తగ్గట్టుగానే మూవీస్ కూడా మంచి హిట్ ట్రాక్ లో పడుతున్నాయి. దీంతో ఈ హీరో బాగా కమర్షియల్ అయిపోయాడనే సమాచారం అందింది. అది ఎంతలా అంటే హిట్ పడటమే లేటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అసలే పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కావడం లేదు.. రెమ్యునరేషన్ విషయంలో అందరికీ షాకిస్తున్నాడు.
ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఫహాద్ ఫాజిల్ ‘పుష్ప 2’లో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీకి గాను ఫహాద్ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రోజువారీగా తీసుకుంటున్నట్లు సమాచారం. దీనికి కొన్ని వింత కండిషన్స్ కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకి అదేమిటంటే.. ఈ హీరో రోజుకి రూ.12 లక్షలను రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేశారట. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకు రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్స్ మూవీ షూట్ క్యాన్సిల్ చేయకుండా కచ్చితంగా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఫహాద్.. పుష్ప నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మరీ, పుష్ప 2 సినిమాకు గాను ఫహాద్ ఫాజిల్ పెట్టిన కండిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.