డార్లింగ్ ప్రభాస్‌ను పాన్ ఇండియన్ స్టార్ చేసిన మూవీ బాహుబలి. దర్శక ధీరుడు జక్కన చెక్కిన అద్భుతమైన సినీ కావ్యాలలో తొలి వరుసలో ఉంటుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి విదితమే. బాహుబలి ది బిగినింగ్. బాహుబలి ది కంక్లూజ్. ఈ మూవీ కోసం ప్రభాస్ మరో సినిమా ఒప్పుకోకుండా ఐదేళ్లు కష్టపడ్డాడని, ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఇప్పటికీ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అలాగే తెలుగు సినిమా దశ, దిశను ఈ చిత్రం మార్చేసింది అనడంలో ఎటువంటి సంకోచం లేదు. ఇందులో అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అడవి శేష్, సుదీప్, రోహిణి కీలక పాత్రలు పోషించిన సంగతి విదితమే.
ఇక బాహుబలి-1 తొలి సీనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. తొలి సినిమాలో.. ఓ చంటి బిడ్డను చేతిలో పట్టుకుని రమ్యకృష్ణ ప్రాణాలతో పోరాడుతుంది. నదిలో పడిపోయిన శివగామి.. అమరేంద్ర బాహుబలి బతకాలి అంటూ బిడ్డను పైకి ఎత్తి పట్టుకుని తను నీళ్లలో మునిగిపోతుంది. ఈ మూవీకి ఈ సీన్ తొలి హైలెట్‌గా నిలవడమే కాదు.. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ చేశాడు ప్రముఖ డైరెక్టర్. తన కొడుకులను కూడా బహుబలి రా’లో పైకెత్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్ అయింది. ఇంతకు ఈ పిల్లలను బహుబలిలా ఎత్తుకున్న దర్శకుడు ఎవరంటే విఘ్నేష్ శివన్. ఫాదర్స్ డే సందర్బంగా తన కొడుకులు ఉయిర్, ఉలగం ఈ సీన్ రీక్రియేట్ చేశాడు నయన్ హాస్బెండ్.
ఫాదర్స్ డ సందర్బంగా తన కవల పిల్లలతో గడిపిన స్వీట్ మొమొరీస్‌ను పంచుకున్నాడు విఘ్నేష్. నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. మై డియర్ బాహుబలి 1 అండ్ 2 (ఉయిర్, ఉలగం).. హ్యాపీ ఫాదర్స్ డే. తన జీవితంలో వీరి రాకతో ఎంతో సంతోషం నిండిపోయిందని ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పలువరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వాట్ ఎ క్రియేటివిటీ.. వాట్ ఎ విజన్ అని ఓ నెటిజన్.. క్యూట్ అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. మొత్తానికి బాహుబలి సినిమా సీన్ రీ క్రియేట్ చేసి.. ప్రభాస్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు ఈ దర్శకుడు.