సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆస్తకి చూపిస్తారు. ఇలా నెటినజ్ల ఆసక్తితో పాటు సినిమా వాళ్లకు కూడా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇక ఇటీవల కొందరు సెలబ్రిటీలు అయితే ఏకంగా తమ ప్రేమ, పెళ్లి, నిశ్చితార్థం వంటి వాటి గురించి కూడా షేర్ చేసుకుంటున్నారు. అలా ఇప్పటికే కొన్ని సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కగా, మరికొందరు సిద్దమయ్యారు. ఆ జాబితాలో మరో యువ నటుడు చేరాడు. తన ప్రియురాలితో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఏ సినీ ఇండస్ట్రీలో చూసినా పెళ్లిళ్లు సీజన్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా, మరికొందరు నిశ్చితార్ధం చేసుకుని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇటీవలే కోలీవుడ్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం చేసుకుని కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టింది. గతంలో మళయాళ హీరో కాళిదాస్ జయరామ్ తన గర్ల్ ఫ్రెండ్ తారిణి కళింగరాయర్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వారి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే బాలీవుడ్ హీరోయిన సోనాక్షి సిన్హా కూడా సింగిల్ మ్యాఫ్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి రీడ్ లైఫ్ కు వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవుతుంది. జూన్ 23న ఆమె వివాహం జరగనుంది.
ఇది ఇలా ఉంటే..తాజాగా ఓ తమిళ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని కూడా పెళ్లికి సిద్దమయ్యాడు. తన ప్రేయసి మెడలో మూడుముళ్లు వేసి..ఏడడుగులు వేయనున్నాడు. ఈ క్రమంలోనే జూన్ 16 ఆదివారం ప్రదీప్ నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే ఈ ఎంగేజ్మెంట్ మద్దతు. ఇందుకు సంబంధించిన ప్రదీప్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు చూసిన ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆయనకు విశేషాలు కూడా ఉన్నాయి. ప్రదీప్ ఆంటోని తమిళ బిగ్ బాస్ సీజన్ 7తో ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆ షో ద్వారా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. దాదా, అరువి, వాళ్ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నిశ్చితార్థం జరిగింది, నిన్న #కుటుంబ పురుషుడు#EnakulaamNadakathuNuNinaichen #పరవాయిల్లా పొన్ను కుడుకురంగాఎన్నానంబి#90sKidsSaadhanaigal pic.twitter.com/vyg0DuCnaQ
— ప్రదీప్ ఆంటోని (@TheDhaadiBoy) జూన్ 17, 2024