రోజా(రోజా)బండ్ల గణేష్( bandla ganesh)ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమలో తమ కంటూ ఒక ప్రత్యేకత సంపాదించారు. రోజా హీరోయిన్ గా అత్యున్నత స్థాయిని అందుకుంటే గణేష్ నటుడు నుంచి స్టార్ ప్రొడ్యూసర్ గా పాపులరిటీ సంపాదించాడు. ఇద్దరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు. పైగా వారి స్పీచ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రోజా గురించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
బండ్ల తాజాగా ఒక ప్రముఖ న్యూస్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో రోజా గురించి ప్రస్తావనకి వచ్చింది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా ఆడుదాం ఆంధ్ర, అనేదానిని నిర్వహించింది.అందులో వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం గురించే సదరు యాంకర్ బండ్లని అడిగాడు. దీంతో ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రోజా స్కామ్ చేసింది ఆమె గురించి నాకు తెలుసు నూటికి నూరు శాతం స్కామ్ చేసింది. వాటిల్లో ఆమె డైమండ్ రాణి అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసాడు. అంతే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి ఏడుకొండల వాడి దర్శనానికి జనాన్ని పంపించి డబ్బులు కూడా వసూళ్లు చేసింది.ఇలాంటివి ఇంకా చాలా చేసింది. రోజా అవినీతి మీద సిబిఐ ఎంక్వయిరీ కూడా వెయ్యాలని కోరాడు.
ఇక ఇదే ఇంటర్వ్యూ లో తన గాడ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan)పై ప్రశంసల వర్షం కురిపించాడు. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెప్పిన రోజాకి మా బాస్ మంచి గుణపాఠం చెప్పాడు. అదే విధంగా మా బాస్ ఇప్పుడున్న పొజిషన్ ఆయన స్థాయి కాదు. రాష్టం కోసం తగ్గాడు.ముందు పెద్ద స్థాయికి కూడా వెళ్తాడు.ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని తెలిపాడు. నటుడిగా ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్ పోషించాడు. పవన్ ,ఎన్టీఆర్, చరణ్, రవితేజ లాంటి హీరోలతో భారీ సినిమాలని నిర్మించాడు. నేటికీ బడా హీరో డేట్స్ ఇస్తే సినిమా తియ్యడానికి బండ్ల రెడీ.