దక్షిణాది ఇండస్ట్రీల్లో ఒకటి శాండిల్ వుడ్. ఇక్కడ స్టార్ హీరోలు ఎవరు అంటే చాలా మందికి ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, దివంగత పునీత్ రాజ్ కుమార్, యష్ గుర్తుకు వస్తుంటారు. కానీ వీరిని మించిన నటుడు దర్శన్. ఈ హీరో మినహా మిగిలిన వారంతా ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఇతర భాషల్లో నటించడంతో పాటు తమ సినిమాలను డబ్బింగ్ చేయడం, పాన్ ఇండియా లెవల్లో మూవీస్ విడుదల చేయడంతో ఫేమస్ అయ్యారు. దర్శనం అలా కాదు. కన్నడ చిత్రాలు మాత్రమే చేసి స్టార్ అయ్యాడు. ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా వచ్చి టాప్ హీరో అవ్వడం అంటే మామూలు మాటలు కాదు. డౌన్ టు ఎర్త్ తెలిసిన నటుడు. అలాంటి స్టార్ నటుడు సినిమాలతోనే కాదు వివాదంలో టాప్ ప్లేసులో నిలిచాడు.
దర్శన్.. కన్నడ బాక్సాఫీసును శాసించాడు. అతడు సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్‌కు పండుగ. విపరీతమైన అభిమానులు అతడికి. స్టార్ హీరోలు సైతం ఛాలెంజింగ్ స్టార్ మూవీ వస్తుందంటే.. ఎంత కలెక్షన్లు రాబుడుతుందో అని ఎదురు చూశారు. అంతటి క్రేజ్ ఉన్న నటుడు.. కేవలం ప్రియురాలి కోసం పర్సనల్, కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. పదేళ్ల క్రితం పరిచయమైన పవిత్రగౌడ్‌కు రేణుకా స్వామి అనే వ్యక్తి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడన్న కారణంతో కొట్టి చంపిన సంగతి విదితమే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్శనం, పవిత్రగౌడ్‌తో పాటు మరో 17 మందిని అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటన చందన సీమలో తీవ్ర కలకలం రేపడంతో పాటు చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే.. దర్శన్ చేసిన తోటి నటులు భిన్నంగా పని చేస్తున్నారు. సాధారణంగా తమ ఇండస్ట్రీలో ఎవరైనా అరెస్టు అయితే.. ఆ అంశంపై చర్చించకుండా ఉండటమో.. లేక తీర్పు కోసం ఎదురు చూడటమే. కానీ టాప్ హీరోలు దర్శన్ కు కాస్త వ్యతిరేకంగానే మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. సుదీప్ మాట్లాడుతూ.. మీడియా ఏం చూపిస్తుందో అదే మాకు తెలుసునని, మృతుడి భార్య, ఈ భూమిమీదకు రాణి బిడ్డకు న్యాయం జరగాలి అంటూ బాధితుడు తరుఫున మాట్లాడారు. దోషికి శిక్ష పడితే సినీ పరిశ్రమ సంతోషిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. ఉపేంద్ర సైతం కాస్త విభిన్నంగా స్పందించారు. విచారణ నిష్పక్షపాతంగా జరగాలని అన్నారు. అతడిది తప్పైనా సరే.. తోటి స్టార్ నటుడు అని తెలిసి.. మోరల్ సపోర్టు ఇవ్వలేదు. లేదా కామ్ అయిపోతారు. కానీ నటులు కనిపించిన తీరును బట్టి చూస్తే దర్శన్ అంటే కన్నడల్లో కోపం ఉందా. అతడంటే పెద్ద హీరోలకు పడ్డా అన్నప్రశ్న తలెత్తుతుంది.