కన్నడ చిత్ర పరిశ్రమ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుగా మారింది. ఇటీవల సంచలనం సృష్టించిన రేణుకా స్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన దర్శన్ వ్యవహారం నడుస్తుండగానే కన్నడ పరిశ్రమలో మరో వివాదం చోటు చేసుకుంది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ సోదరుడి కుమారుడైన యంగ్ హీరో యువరాజ్‌కుమార్ భార్య శ్రీదేవిపై ‘కాంతార’ హీరోయిన్ సప్తమి గౌడ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ ఘటన ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
‘యువ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు రాజ్‌కుమార్. ఇందులో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించింది. సినిమాకి మంచి టాక్ రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్నే అందుకుంది. సినిమా పరంగా యువకరువు వ్యకిగత జీవితంలో అఘాతం ఏర్పడింది. తన భార్య వేధింపులు భరించలేక రాజ్‌కుమార్ తనకు విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసు అందుకున్న రోజు నుంచి రాజ్‌కుమార్ భార్య శ్రీదేవి మీడియాలో తరచూ కనిపిస్తూ రాజ్‌కుమార్‌పై, హీరోయిన్ సప్తమిగౌడ్‌పై సంచలన ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. తన భర్త విడాకులు కోరడానికి కారణం సప్తమి గౌడ అని, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించింది. అంతేకాదు, తాను అమెరికా వెళ్లినపుడు ఇద్దరూ లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని శ్రీదేవి ఆరోపిస్తోంది.
ఒప్పందం సప్తమి సీరియస్ అయింది. శ్రీదేవిపై సప్తమి కేసు వేసింది. తన పరువుకు నష్టం వాటిల్లే ఆరోపణలు చేస్తున్న శ్రీదేవిపై చర్యలు తీసుకోవాలని తన పిటిషన్‌లో కోరింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం వల్ల పరువుపోయిందని, అందుకే పరువు కింద రూ. రూ.10 కోట్లు చెల్లించాలని సప్తమి కోరింది. అంతేకాదు, తనపై నిరాధార ఆరోపణలు చేసిన శ్రీదేవి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పస్తమి డిమాండ్ చేస్తోంది.