హ్యాపీ డేస్,కొత్త బంగారులోకంతో వరుణ్ సందేశ్ (varun sandesh)యువ ప్రేక్షకుల హృదయాలలో చాలా బలమైన ముద్ర వేసాడు. ఆ సినిమాల ద్వారా వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ తో ఎక్కువగా లవ్ మూవీస్ నే చేసాడు. కానీ వరుస పరాజయాలు చుట్టు ముట్టాయి. దీంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు నింద (నింద)అంటూ రాబోతున్నాడు.ఈ సందర్భంగా చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి.
దర్శక నిర్మాతలు నా దగ్గరకి వచ్చినప్పుడు ప్రేమ కథలతో వచ్చేవారు. దాంతో ప్రేక్షకులు అమ్మాయిల వెంట తిరిగే లవర్ బాయ్ గానే నన్ను ఊహించుకొని మూవీకి వచ్చేవారు.నాకు కూడా ఎప్పుడు అదే తరహా పాత్రలు చేయడం వల్ల అసంతృప్తిగా అనిపించేది. పైగా కథ చెప్పేటప్పుడు ఒకలా చెప్తారు.కానీ తెర మీద ఇంకోలా తెరకెక్కుతాయి. దాంతో అసలు నేనేం చేస్తున్నాను అని ఊహించుకొని సినిమాలు ఆపి అమెరికా కి వెళ్ళిపోయా. ఏడాదిన్నర తర్వాత మళ్ళి సినిమా చేయాలనీ వచ్చా. ఆ సమయంలో నింద కథ నా దగ్గరకి వచ్చింది. నిజానికి ఇలాంటి కథలనే నేను ఇష్టపడతాను. నా గత చిత్రాలకి సంబంధించిన ఛాయలు ఈ సినిమాలోకనిపించవు. ఇన్నాళ్లకి నాకు నచ్చిన కథ దొరికిందని చెప్పాడు.
ఇక నింద సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో తెరుచుకుంటుంది. ఈ టైపు సినిమాలు గతంలో వచ్చినా కూడా ఒక సరికొత్త స్క్రీన్ ప్లే తో వస్తుందనే విషయం ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. విచిత్రం ఏంటంటే ఈ మూవీ క్లైమాక్స్ ని ఆర్టిస్టులు ఎవరకి చెప్పకుండా షూట్ చేసారు. వరుణ్ సందేశ్ తో పాటు తనికెళ్ల భరణి, భద్రం, అన్నే జిబి, శ్రేయ రాణి రెడ్డి, సూర్య చేసిన ముఖ్య పాత్రలు పోషించారు. రాజేష్ జగన్నాధం (రాజేష్ జగన్నాధం) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు.ఓంకార్ సంగీతాన్ని అందించిన రమీజ్ కెమెరామెన్. ఈ నెల 21న విడుదల కాబోతుంది.