ఓ వరుస వైపు సినిమాలలో నటిస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో బాలకృష్ణకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, ఈసీ మెంబర్ దిల్ రాజు.. బాలయ్యను కలిసి అభినందనలు తెలియజేశారు.