ప్రతిఒక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. ఈ విధంగానే కొందరు బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంటే.. కొందరు నటులుగా గుర్తింపు తెచ్చుకోవడానికి మరి ఆసక్తి చూపిస్తారు. అందుకోసం చాలామంది హార్డ్ గా వర్క్ చేస్తున్నారు. అయితే నటులుగా నటనను పండించడం ఎంత కష్టమో, గుర్తింపు తెచ్చుకోవడం కూడా అంతే కష్టం. అందుకే చాలామంది ఇండస్ట్రీలో మెరవాలంటే.. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ప్రయాణం మొదలుపెడతారు.అలాగే మరి కొందరైతే.. బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇస్తారు. ముఖ్యంగా బుల్లితెరలో యాంకర్లుగా తమ సత్తాను చాటి మంచి ఫేమ్ ను సంపాదించుకొని, ఆ తర్వాత వెండితెర పై అడుగులు వేస్తారు. ఇప్పటికే ఈ తరహాలో జర్నీ చేసే వారు చాలా మంది ఉన్నారు.
కాగా, వారిలో సుధీర్,ప్రదీప్, సుమ, అనసూయ, రష్మీ లాంటి వాళ్లు ఉండగా.. వారితో పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న మరో ఫిమెల్ యాంకర్ కూడా ఉన్నారు. అవును పై ఫోటోలో చిన్న సైజ్ లౌడ్ స్పీకర్ అన్నట్టుగా అరుస్తున్నా ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు బుల్లితెరపై సుదీర్ఘకాలంగా రాణిస్తున్న ఓ స్టార్ యాంకర్. ఇక ఈమె స్క్రీన్ పై కనిపించిందంటే.. రచ్చ..రచ్చే. ముఖ్యంగా తన మాటతో, గ్లామర్ తో అలరిస్తూ బుల్లితెర రాములమ్మ గా పేరు తెచ్చుకుంది. ఈ పాటికే ఆమె ఎవరో మీకు అర్ధమైపోతుంది. ఆమె మరెవరో కాదు.. బుల్లితెర లౌడ్ స్పీకర్, ఎనర్జిటిక్ యాంకర్ ‘శ్రీముఖి’. ప్రస్తుతం బుల్లితెర పై వరుస షోలో పూర్తిగా మారిపోయింది ఈ అమ్మడు.
అయితే ఈ మొదట్లో అదుర్స్ అనే కార్యక్రమంతో యాంకర్ గా ప్రయాణం మొదలు పెట్టింది. ఆ తర్వాత జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత.. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీలో మంచి స్కోప్ ఉన్న రోల్ చేసింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో మెరిసింది కానీ అవి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. దీంతో తిరిగి బుల్లితెరపై అడుగుపెట్టి మళ్లీ పలు షోలకు హోస్టగా వ్యవహారించింది. ఈ కోరిక శ్రీముఖికి ఎక్కువగా పటాస్ కామెడీ షోతో ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక దీని తర్వాత, సరిపమప,జాతిరత్నాలు వంటి పలు షోలలో అలరించింది శ్రీముఖి. అయితే ప్రస్తుతం ఈమె నాతోనే డాన్స్ 2.0 షోలో హోస్ట్ గా అలరిస్తుంది.
ఇక ఈ షో సెమీ ఫైనల్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ చిన్ననాటి ఫొటోలతో పాటు.. జడ్జీలు, యాంకర్ల ఫొటోలను చూపించి, వీళ్లెవరో గుర్తుపట్టాలని టాస్క్ ఇచ్చారు. అయితే ఇందులో శ్రీముఖి చిన్ననాటి ఫొటోను చూపించారు. ఆ ఫొటోనే ఇది. అయితే శ్రీముఖి ఫొటోను చూపించగానే.. నయని పావని వెంటనే గుర్తుపట్టేసింది. శ్రీముఖి అక్క అనేసింది. ఆ తర్వాత.. మరో కంటెస్టెంట్ బ్రిట్టో కూడా శ్రీముఖి అని గెస్ చేసేశాడు. ప్రస్తుతం శ్రీముఖి చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి, శ్రీముఖి చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.