టాలీవుడ్ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా తన సత్తా చాటుతోంది. ప్రతి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని నలు దిక్కులకు వ్యాపింపజేస్తోంది. ఇంకా టాలీవుడ్ రేంజ్ ని మరో మెట్టుకు తీసుకెళ్లే సినిమాలు చాలానే ఉన్నాయి. వాటికి సంబంధించిన హీరోలు అంతా చాలా ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది టాప్ హీరోలు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ కాన్సెప్ట్స్ తో నిండా సినిమాలతో బిజీ కాలం గడిపేస్తున్నారు. మరోవైపు టాప్ హీరోలకు యాడ్స్ కూడా ఉన్నారు. ఫ్యాన్స్ చెప్పుకోవడానికి వరుస సినిమా అప్ డేట్స్ ఇస్తూ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. కానీ, మహేశ్ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క అప్ డేట్ లేదు. ఒక్క యాడ్ లేదు. కానీ, ఫ్యాన్స్ మాత్రం నెత్తింట కాలర్ ఎగరేసుకుంటున్నారు. మరి.. అంత మంచి విషయం ఏముందో చూద్దాం.
సూపర్ స్టార్ మహేశ్ గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేతినిండా ప్రాజెక్టులు, యాడ్స్ తో మహేశ్ ఎప్పుడూ ఫుల్ ఉంటాడు. కానీ, ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి ఒక్క అప్ డేట్ లేదు. రాజమౌళి సినిమా ఇంకా సెట్స్ మీదకు రాలేదు. మహేశ్ ప్రస్తుతం క్యారెక్టర్ కోసం మేకోవర్ లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. కానీ, ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఫ్యాన్స్ షేర్ కలిగి ఒక్క అప్ డేట్ కూడా లేకపోయినా.. మహేశ్ ఫ్యాన్స్ మాత్రం నెత్తింట కాలర్ ఎగరేసుకుంటున్నారు.
సాధారణంగా మహేశ్ బాబు అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. రియల్ లైఫ్ ఇన్ స్పిరేషన్ కూడా. మహేశ్ బాబు చేసే మంచి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలే మహేశ్ గొప్పతనం గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. తాజాగా మరో గొప్ప విషయంతో మహేశ్ వైరల్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తన అభిమానికి ఆరోగ్యం బాలేదని.. పిల్లలు బడికి వెళ్లకుండా పనులు చేసుకుంటున్నారని తెలుసుకుని మొత్తం కుటుంబాన్నే దత్తత తీసుకున్నాడు. అలాగే ఆ పిల్లలను బడికి పంపించాడు. ఇవి కాకుండా.. మహేశ్ బాబు చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేస్తూ ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాడు.
ఇలాంటి మంచి పనులనే ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తమ హీరో స్క్రీన్ మీద మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా నిజమైన స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. సినిమాలు, సినిమా అప్ డేట్స్ కాకుండా.. ఇలాంటి మంచి పనులతో తమ హీరో వార్తల్లో నిలవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఇది చాలా మంది పరిణామం అంటే చెప్పాలి. ఒక సినిమా హీరో.. రియల్ లైఫ్ లో కూడా హీరోగా మారి కొన్ని వందల కుటుంబాల్లో నవ్వులు పూయించడం సాధారణమైన విషయం కాదు. ఇప్పుడు అదే కార్యక్రమం మహేశ్ ఫ్యాన్స్ కూడా గర్వంగా చెప్పుకుంటున్నారు. నిజంగా ఇది ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తే న్యూసే అవుతుంది.