తమ అభిమాన నటి, నటుల పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయాలని ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. కొందరు పాలాభిషేకాలు చేస్తే.. మరికొందరు రక్తదానాలు చేస్తారు. ఇంకొందరు ఇంకో రకంగా తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన 39వ పుట్టినరోజు(19, జూన్) జరుపుకుంది. ఇక తమ అభిమాన నటి బర్త్ డే సందర్భంగా కొందరు ఫ్యాన్స్ ఆమెకు గుర్తుండిపోయే గిప్ట్ ఇచ్చారు. దాంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమెకు ఫ్యాన్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన 39వ పుట్టినరోజును జరుపుకుంది. దీంతో ఆమెకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే చాలా మంది విషెస్ చెప్పి వదిలేశారు. కానీ కొందరు ఫ్యాన్స్ మాత్రం ఆమెకు జీవితాంతం గుర్తుండిపోయే గిప్ట్ ను ఇచ్చారు. దాంతో కాజల్ ఎమోషనల్ అయ్యింది. ఇంతకీ ఆమె బర్త్ డేకి ఫ్యాన్స్ ఇచ్చిన బహుమతి ఏంటంటే?
కాజల్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ 150 మందికి భోజనం పంపిణీ చేశారు. అలాగే మీఖరులోపు 50 ముక్కలను కూడా నాటుతామని చెప్పారు. ఇక ఈ వీడియో చూసిన కాజల్ ఎమోషనల్ అయ్యింది. “సమాజం పట్ల మీ ఆలోచన, దయ నన్ను ఆశ్చర్యపరుస్తోంది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు” అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చి.. ఫుడ్ పంపిణీ వీడియోను షేర్ చేసింది. ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే.. ఈ మధ్యే ‘సత్యభామ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. కమల్ హాసన్ పక్కన ఇండియన్ 2లో నటించింది. వీటితో పాటుగా మూవీల్లో నటిస్తోంది.
మీ ఆలోచనాశక్తి మరియు సమాజం పట్ల దయగల కరుణతో నన్ను ఆశ్చర్యపరచడంలో మీరు ఎప్పుడూ విఫలం కాలేరు. నా అద్భుతమైన స్నేహితులకు చాలా ధన్యవాదాలు @వెకాఫవా అన్ని పుట్టినరోజు ప్రేమ కోసం https://t.co/5F4xTZiZ10
— కాజల్ అగర్వాల్ (@MsKajalAggarwal) జూన్ 20, 2024
- ఇదికూడా చదవండి: Deepika Padukone: కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్.. దీపిక ధరించిన బ్రేస్ లెట్ అంత ఖరీదా? లక్షల్లో కాదు ఏకంగా..