రేణుకా స్వామి అనే వ్యక్తిని చంపాడన్న ఆరోపణలపై కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగదీప, ప్రియురాలు పవిత్రగౌడ్‌తో పాటు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పవిత్రగౌడ్‌కు అసభ్యకర సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. షెడ్డులో పడేసి విచక్షణారహితంగా తన్నడంతో అతడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ కేసులో ఒక్కొక్కటిగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే నిందితుల ఇంట్లో సోదాలు చేస్తున్న సంగతి విదితమే. పవిత్రగౌడ ఇంట్లో చెప్పిన సోదాల్లో ఆమె దుస్తులు, సీజ్ చేశారు. హత్య సమయంలో దర్శనం వినియోగించిన లోఫర్స్‌ను ఆయన భార్య విజయలక్ష్మీ ఫ్లాట్‌లో తాజాగా పోలీసులు గుర్తించారు.
వీటి రికవరీతో ఈ కేసులో కీలక ఆధారాలు పోలీసులకు లభించినట్లయ్యింది. ఈ నెల 9న రేణుకాస్వామి హత్య జరగ్గా.. మృతదేహాన్ని పారేసి హోస్కెరహల్లిలోని భార్య విజయలక్ష్మీ ఫ్లాట్‌కు వెళ్లాడు. అక్కడి నుండి మైసూర్ వెళ్లే మసయంలో ఇంట్లో పూజలు చేశాడు. ఈ నేపథ్యంలో దర్శన భార్య విజయలక్ష్మీకి కూడా పోలీసులు సమన్లు జారీ చేసి బుధవారం ఐదు గంటల పాటు విచారించారు. అంతేకాదు.. లోఫర్స్‌ను ఎవరైనా కడిగారేమోనని అడిగి తెలుసుకున్నారు. ఈ హత్య అనంతరం కొన్ని దుస్తులు, ఫుట్ వేర్‌ను దర్శన్ కాస్ట్యూమ్ అసిస్టెంట్ రాజు తెచ్చి హీరో భార్యకు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఆమెను సాక్షిగా చేర్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే.. తొలిసారి ఈ హత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది భార్య విజయలక్ష్మి.
హత్య జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఆమె మౌనం వీడింది. ముందుగా రేణుకాస్వామి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన దర్శనం భార్య.. బాధిత కుటుంబ సభ్యులకు అతడిని పట్టుకోలేకపోయాడు. ఆ బాధను వర్ణించలేను. న్యాయస్థానం నుండి ఉత్తర్వులు వచ్చేంత వరకు మీడియా, సోషల్ మీడియా సైట్లలో ఎటువంటి అవకాశం లేదా అనధికారికంగా ప్రచురించబడకుండా అభ్యర్థించారు. తల్లి చాముండేశ్వరి, న్యాయ వ్యవస్థపైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. సత్యం గెలుస్తుంది’ అంటూ హత్యపై అనధికారికంగా ప్రచురించకుండా మీడియా సంస్థలపై సెషన్స్ కోర్టు జారీ చేసిన నిషేధాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.