గత ఆంధ్రప్రదేశ్ టీడీపీ 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితమైతే.. దేవుడి స్క్రిప్ట్ అంటూ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు వైసీపీ అంతకుమించి ట్రోల్స్ కి వస్తోంది. ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ అతి కష్టం మీద 11 మంది ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. దీంతో వైసీపీ మీద ఫుల్ ట్రోల్స్ వస్తున్నాయి. “11 సీట్లు గెలిచి, ఏపీకి ఐపీఎల్ టీం లేదనే లోటు తీర్చిన వైసీపీ” అంటూ కొందరు ట్రోల్ చేస్తుండగా.. మరి కొందరేమో గడియారంలో 11వ నెంబర్ కి బదులుగా జగన్ ఫొటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ‘లెవన్'(11) అనే టైటిల్ తో సినిమా వస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
నవీన్ చంద్ర హీరోగా లోకేష్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘లెవన్’. నవీన్ చంద్ర పోలీస్ గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా టైటిల్ ‘లెవన్’ కావడం చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 11 నెంబర్ తెలుగునాట హాట్ టాపిక్ అవుతుండటంతో.. వైసీపీని టార్గెట్ చేస్తూ ఈ టైటిల్ పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ చిత్ర దర్శకుడి పేరు లోకేష్ కావడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే మూవీ టీం మాత్రం.. ఈ సినిమా టైటిల్ ముందే పెట్టామని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని చెబుతోంది.