క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపించే పేరు. పరిశ్రమలో ఎదురైన అనుభవాల గురించి చాలా మంది లేడీ యాక్టర్లు బహిరంగంగానే మాట్లాడారు. అప్పట్లో మీటూ ఉద్యమం పేరుతో అనేక మంది తారలు మీకు ఇండస్ట్రీలో ఎదురైన ఛేదు అనుభవాలను కలిగి ఉన్నారు. అయితే ఇప్పటికీ ఇండస్ట్రీలో క్యాచ్ కౌచ్ ఉందని చాలా మంది హీరోయిన్స్ చెబుతూనే ఉన్నారు. ఓ స్టార్ హీరో తనను ఒంటరిగా రమ్మన్నాడు అంటూ తన జీవితంలో ఎదురైన భయంకర అనుభవాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది స్టార్ హీరోయిన్. ఈ బ్యూటీ తెలుగులో నాగార్జున సరసన ఓ మూవీలో కూడా నటించింది.
ఇషా కొప్పికర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీక పోవచ్చు. కానీ టాలీవుడ్ లో ఆమె నాగార్జునతో ఓ మూవీ చేసింది. నాగ్ చిత్రం ‘చంద్రలేఖ’ మూవీలో ఇషా కొప్పికర్ నటించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఇన్నాళ్లకు పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ నిజాలు.
“ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏం చేస్తారని ఎవ్వరూ చూడరు, అడగరు. మేం ఏం చేయాలనేది కేవలం హీరోలు మాత్రమే డిసైడ్ చేస్తారు. మీరు విలువలను నమ్ముకొని ఇండస్ట్రీలో ఉంటే.. కష్టాలు పడక తప్పదు. క్యాస్టింగ్ కౌచ్ కు భయపడి ఎందరో హీరోయిన్స్ పరిశ్రమకు దూరమయ్యారు. కొన్ని పనులకు అమ్మాయిలు ఒప్పుకోవాలి, లేదంటే సినిమాలు ఉండవు. ఇక నాకు 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో నా దగ్గరికి వచ్చి.. ఒంటరిగా రావాలని, నీతో డ్రైవర్ కూడా ఉండకూడదని చెప్పాడు” అంటూ తన జీవితంలో ఎదురైన ఛేదు సంఘటనలను 29 ఏళ్ల తర్వాత ఇషా కొప్పికర్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.