పాన్ ఇండియా స్టార్ నుండి గ్లోబల్ స్టార్‌కు మారిన బ్యూటీ ప్రియాంక చోప్రా. తమిళన్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ మాజీ మిస్ సుందరి.. అనంతరం బాలీవుడ్‌కు వెళ్లి.. హీరోయిన్ టాప్‌గా అవతరించింది. బేవాచ్ మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. అక్కడ కూడా పలు చిత్రాలలో నటించి మెప్పించింది. 2018లో అమెరికన్ సింగర్, రైటర్, యాక్టర్ నిక్ జోనస్‌కు వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం ఇంగ్లీష్ చిత్రాలు చేస్తూ గడుపుతోంది. అలాగే ఆమె పలు వ్యాపారాలు చేస్తున్న సంగతి విదితమే. అందులో ఒకటి హోటల్ బిజినెస్. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. 2021లో ప్రియాంక చోప్రా, మనీష్ గోయల్ సంయుక్తంగా ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు.
ఆ హోటల్ పేరు సోనా. ఈ హోటల్ ప్రారంభించినప్పుడు అనుపమ్ ఖేర్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వంటి స్టార్ ఓపెనింగ్ సమయంలో కనిపించారు. హిందూ సంప్రదాయం ప్రకారం..పూజలు నిర్వహించి.. అప్పుడు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది ప్రియాంక. ఇక్కడ ఎక్కువగా భారతీయ వంటకాలు ఇక్కడ లభిస్తాయి. అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్స్, భారత ఫుడ్ మిస్సైన ఎన్నారైలు, అలాగే బాలీవుడ్ ప్రముఖులు సైతం అక్కడకు వెళతారు. ఇప్పుడు తన పార్ట్‌నర్ షిప్ నుండి ప్రియాంక చోప్రా తప్పుకుంది. అయితే నటి చేసుకున్న ఒప్పందం ముగియడంతో రెస్టారెంట్ షట్ డౌన్ రెస్టారెంట్ టీం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
జూన్ 30న చివరిసారిగా ఇక్కడ భోజనం వడ్డిస్తామని ప్రకటించారు. ఆరు క్రితమే ప్రియాంక తన నెలల వాటాను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. ఆమె వెనక్కు తగ్గడంతోనే.. లాభాలు కూడా లేకపోవడంతో సోనా రెస్టారెంట్‌ను చూసినట్లు తెలుస్తుంది. అయితే అసలైన కారణాలు వెల్లడి కాలేదు. ‘మూడేళ్ల అదమైన ప్రయాణం తర్వాత సోనా ఆగిపోబోతోంది. మీకు సేవ చేసే అవకాశం మాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు గౌరప్రదయమైన విషయం. జూన్ 30న చివరి సేవలు అందించబడతాయి’ అని పోస్ట్‌లో వైద్య రెస్టారెంట్ టీం. 2023 చివరిలో ప్రియాంక తనకున్న భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకుంది. ఆమె తప్పుకున్న ఆరునెలలకే రెస్టారెంట్ మూత పడుతుంది. ప్రస్తుతం ఆమె హెడ్స్ ఆఫ్ ది స్టేట్, బ్లఫ్ చిత్రాల్లో నటిస్తోంది.