హీరోల ఇమేజ్ కి ఎక్స్‌పైరీ డేట్ ఉండదనే నానుడి సినీ లవర్స్ లో ఉంది. కాకపోతే కొంత మంది హీరోయిన్లు ఆ నానుడి మాకు కూడా వర్తిస్తుందని ఘంటా పదంగా చెప్తారు. అలాంటి వాళ్ళలో ఒకరు అనుష్క(anushka)మంగుళూరు కి చెందిన ఈ ముద్దుగుమ్మ 2005 లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీ ద్వారా తెరంగ్రేటం చేసింది. మాగ్జిమమ్ స్టార్ హీరోలందరితో జత కట్టింది. అరుంధతి తో హీరో స్థాయి ఇమేజ్ తో పాటు తన కంటూ సొంతంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ఇక బాహుబలితో ఆ ఫిగర్ ని రెట్టింపు చేసుకుంది. కొంత కాలంగా ఆమె నుంచి సినిమాలు లేవని అనుకుంటున్న వేళ తాజా న్యూస్ ఒకటి ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.
అనుష్క ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతుంది. ఎవరైనా జోక్ చేస్తే ఏం చేస్తాం. మనసారా హాయిగా నవ్వుతాం. ఆ విధంగా మహా అయితే ఒక రెండు నిముషాలు నవ్వుకుంటాం. కానీ అనుష్క మాత్రం ఒక్కసారి నవ్వడం ప్రారంభిస్తే చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుంది. పైగా తనకి చాలా త్వరగా నవ్వొస్తుంది. అంటే జోక్ కంప్లీట్ అవ్వకుండానే నవ్వుతుంది. దాని వల్ల షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాలన్నింటిని అనుష్క నే స్వయంగా చెప్పింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవ్వడంతో అనుష్క ఆ ప్రాబ్లెమ్ నుంచి బయటపడాలని అభిమానులతో పాటు శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.
సినిమాల పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆ మూవీ మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో కథానర్ అనే మూవీ చేస్తుంది. సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన పంతొమ్మిదెళ్ళ తరువాత మలయాళ చిత్ర సీమలో అడుగుపెడుతుంది. తెలుగు డైరీ మాత్రం ఖాళీగా ఉంది. ఇక అభిమానులకి అయితే ఒక తీరని కోరిక మిగిలి ఉంది. అదేంటంటే ఆమె వివాహం.