హీరోలు, హీరోయిన్లపై అభిమానం ఉండొచ్చు కానీ అది హద్దులు మీరకూడదు. వాళ్లకంటూ ఓ ప్రైవేట్ స్పేస్ ఉందని మర్చిపోతున్నారు. కన్నడ నటుడు దర్శన్ విషయంలో అభిమానమే కొంప ముంచింది. ప్రియురాలితో తమ అభిమాన నటుడు రిలేషన్ షిప్‌లో ఉండటాన్ని తట్టుకోలేక పవిత్రగౌడ్‌కు అసభ్యకర మేసేజ్, సందేశాలు పంపించాడు రేణుకా స్వామి అనే ఫ్యాన్. ఈ విషయం హీరోకు తెలిసి అతడ్ని అత్యంత దారుణంగా కొట్టి చంపిన సంగతి విదితమే. ఈ కేసులో ప్రస్తుతం దర్శన్ పోలీసు కస్టడీలో ఉండగా.. పవిత్ర గౌడ బెంగళూరు పరప్పన్ జైలుకు వెళ్లింది. ఇదిలా ఉంటే..ఇప్పుడు దర్శనం మరో మహిళా అభిమాని వివాదంలో చిక్కుకుంది. ఆమెపై రెండు ఫిర్యాదులు నమోదయ్యాయి. కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగదీపకు మేల్ అభిమానులే..కాదు ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువే.
అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన అరెస్టు కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా అనుచిత పదజాలంతో విరుచుకుపడుతుంది. ఆమె ఓవరాక్షన్ చేయడంతో పోలీసులను ఆశ్రయించారు జేడీఎస్ కార్యకర్తలు. మాండ్యలోని కేఆర్ పేట్ టౌన్ పోలీస్ స్టేషన్, సైబర్ క్రైమ్ సెంట్రల్ పోలీస్ స్టేషన్లలో మీకు ఫిర్యాదులు అందాయి. దర్శన్ అరెస్టులో కేంద్ర మంత్రి, మాజీ సీఎం హెచ్‌డి కుమార స్వామి ప్రమేయం ఉందని సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుమలత కారణంగానే మాండ్య సీటుకు పోటీ చేశారు, దర్శన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు రూ. 150 ఇచ్చి మనుషుల్ని తీసుకొచ్చారంటూ ఈ కేంద్ర మంత్రిపై కించపరిచే పదజాలంతో ఆరోపణలు చేసింది. దీంతో ఆమెపై ఫిర్యాదులు చేశారు జేడీఎస్ కార్యకర్తలు. ఆమెను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్, అతడి ప్రియురాలు అరెస్టైన వివాదానికి దూరంగా ఉంటున్నారు హెచ్‌డి కుమారస్వామి. ఎక్కడా స్పందించలేదు. అలాగే ఆయన కుమారుడు నిఖిల్ కూడా స్పందించేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు మాత్రమే అన్నాడు. జూన్ 8న రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. బెంగళూరుకు తీసుకెళ్లి షెడ్డులో అత్యంత హేయనీయంగా దాడి చేయడంతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో రోజుకొక్క కోణం వెలుగులోకి వస్తోంది. దర్శనంతో పాటు ఆరుగురి కస్టడీని పొడిగించగా.. పవిత్రతో పాటు మిగిలిన నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది.