గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించారు. అయితే ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాల్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఏది అంటే అది ఆరెంజ్ మూవీ అని చెప్పవచ్చు. కాగా, ఈ మూవీని 2010లో బొమ్మరిల్లు బాస్కర్ ప్రదర్శించారు. ఇక ఇందులో జెనీలియా హీరోయిన్ గా నటించింది. అలాగే ఆరెంజ్ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా ప్రొడ్యూసర్ నాగబాబు నిర్మించారు. ఇక అప్పటిలో యూత్ ను ఆకట్టుకునే ఒక మంచి లవ్ స్టోరిగా పేరు తెచ్చుకున్న ఈ సినిమా కనమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా పడింది. కానీ, ఈ సినిమాలో సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయే ప్రత్యేకంగా చెప్పవక్కర్లేదు.
అలాగే ఇప్పటికి ఆరెంజ్ మూవీ సాంగ్స్ యువర్ గ్రీన్ గానే ఉంటాయి.ఇక ఈతరం జనరేషన్ ఆరెంజ్ సినిమా పాటలకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అసలు ఇప్పటిలో ఆ సినిమా తీసి ఉందో బాగుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ సినిమా సాంగ్స్ ఎక్కడ వినిపించినా సరే యూత్ ఆ రాగాన్ని చాలా అవలీలగా అందుకుంటూ పాడేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే. తాజాగా అమెరికాలో జరిగిన ప్లేబ్యాక్ సింగర్ కార్తిక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. కాగా, ఆ ఈవెంట్ లో కార్తిక్ ఆరెంజ్ మూవీలో ఓ పాట పాడుతుండగా.. ఆడియన్స్ చేసే పనికి షాక్ అయ్యి పాట మానేశాడు. ఇంతకి ఏం జరిగిందంటే..
ఇటీవల అమెరికాలో ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. కాగా, ఆ ఈవెంట్ లో స్టేజ్ పై ఉన్న కార్తీక్ ఆరెంజ్ సినిమా నుంచి చిలిపిగా చూస్తావేలా సాంగ్ పాడడం ప్రారంభించాడు. ఇక ఈ సాంగ్ స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న అడియన్స్ ఈ పాటను పాడడం మొదలుపెట్టారు. దీంతో పాట పాడాల్సిన కార్తీక్ ఆశ్చర్యపోయి వెంటనే పాట పాడటం ఆపేసి.. మ్యూజిక్ ఆపాలంటూ వెనుక ఉన్న మ్యూజిక్ ప్లేయర్స్ వాళ్లకు సైగ చేశాడు. ఇంకా.. మీరే పాడుకోండి నేను చూస్తుంటా అన్నట్లుగా అక్కడే చేతులు కట్టుకుని నిలబడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆరెంజ్ సాంగ్స్ క్రేజ్ చూసి ఆశ్చర్యపోతున్నారు . అయితే కార్తీక్ ఆరెంజ్ పాటలను పాడడం స్టార్ట్ చేసినప్పుడు అడియన్స్ కూడా పాడడం ఇది మొదటి సారి కాదు. ఎందుకంటే.. మ్యూజిక్ గతంలో వైజాగ్ లో జరిగిన కాన్సర్ట్ లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కాగా, కార్తీక్ సాంగ్ పాడడం స్టార్ట్ చేయగానే స్టేజ్ కింద ఉన్న అడియన్స్ పాడడం స్టార్ట్ చేశారు. దీంతో సాంగ్ పాడడం ఆపేసిన కార్తిక్ షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాడు. మరి, ప్రస్తుతం కార్తిక్ కు సంబంధించిన ఫన్నీ వీడియో వైరల్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పడటం ఆపేసాడు 😂😂🤣
ఆరెంజ్ పాటలు ఎల్లవేళలా లూబ్ ♥️#రామ్ చరణ్ pic.twitter.com/YRyiXnuGT2
— 𝐏𝐫𝐢𝐲𝐚𝐡 🐼 (@PriyaRC_4) జూన్ 18, 2024