సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ముఖ్యంగా వారి బంగ్లాలు, ఖరీదైన వాహనాలు, ఇతర వస్తువుల గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి చూపిస్తారు. అలానే తరచూ ఏదో ఒక సెలబ్రిటీకి సంబంధించిన వస్తువులు, ఇతర విషయాల గురించి తెగ వైరల్ అవుతుంది. అలానే తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అమెరికాలో నివాసం ఉండే ఓ విలాసవంతమైన భవనానికి చెల్లించే అద్దె గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
బాలీవుడ్ బాద్ షా షారుఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఖాన్స్ త్రయంలో ఆయన ఒకరు. దేశంలోనే ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే.. ఆస్తుల విషయంలోనూ షారుఖ్ టాప్ లోనే ఉన్నారు. షారుఖ్ ఆస్తుల విలువ రూ.6300 కోట్లు అని ఇటీవల ఫోర్బ్స్ కనిపించింది. ఇంకా అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల జాబితాలో కూడా షారుఖ్ టాప్ లో ఉన్నారు. మూవీలు, యాడ్స్, ఇతర బిజినెస్ ల ద్వారా షారుఖ్ బాగానే అర్జిస్తున్నారు.
ముంబైలో షారుక్ నివాసం ‘మన్నత్’ విలువ 200 మిలియన్లకు పైనే ఉంటుందంట. ఇక షారుఖాన్ కి కేవలం బాంబేలోనే కాకుండా విదేశాల్లో సైతం ఇల్లు ఉంది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. లండన్, దుబాయ్, అమెరికాలో ఆయన విలాసవంతమైన బంగ్లాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా అమెరికాలోని కాలిఫోర్నియా బెవర్లీ హిల్స్ లో ఉన్న మాన్షన్ అయితే ఒక అద్భుతమనే చెప్పాలి. ఈ షారుఖ్ ఖాన్ బంగ్లాలో ఆరు పెద్ద పడక గదులు ఉన్నాయి. ఇక్కడ వారి పిల్లలు సుహానా, అబ్రమ్, ఆర్యన్ ఖాన్ ల కోసం ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి.
ఖాన్ ఉండే ఇళ్లు ఒక లగ్జరీ రిసార్ట్ కంటే కొంచెం కూడా తక్కువ కాదని అభిప్రాయ పడుతున్నారు. ఈ బంగ్లా ఈ ఇంటి చుట్టూ పచ్చదనం మధ్యలో ఉంటుంది. ఇంకా ఈ ఇంట్లో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఈ ఇంటిలో పెద్ద పెద్ద సోఫాలు, గోడలపై అద్భుతమైన కర్టన్లు ఉన్నాయి. ఈ ఇంటి అలంకరణలో విలువైన వస్తువులను ఉపయోగించారు. బాద్ షాకి చెందిన ఈ విలసవంతమైన బంగ్లా ప్రజలకు అద్దెకు కూడా లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఉండేందుకు భారీగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైన ఈ బంగ్లాలో ఉండాలని అనుకుంటే ఒక రాత్రి అద్దె రెండు లక్షల చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం షారుఖాన్ బంగ్లాకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.