ఇప్పుడు సోషల్ మీడియాలో కల్కి సినిమాదే హావ. ఎక్కడ చూసిన అందరు ఈ సినిమా గురించే డిస్కషన్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన విడుదల ట్రైలర్ ఇప్పుడు అందరికి మరింత హైప్ ఇచ్చింది. ఒక సినిమా ప్రేక్షకులలో ఇంత హైప్ క్రియేట్ చేయడం.. మొదటి సారి ఏమో అని ప్రేక్షకులు. ఇంకొక 5 రోజులలో ఈ సినిమా అసలు కథ ఏంటి అనేది అందరికి తెలిసిపోతుంది. జూన్ 27 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు.. ఎంతో ఇంట్రెస్ట్ గా ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఇప్పుడు ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటో చూసేద్దాం.
సెలెబ్రిటీల అందరి ట్వీట్స్ లో రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ ఎప్పుడు కాస్త డిఫ్ఫరెంట్ గాయన్న సంగతి.. అందరికి తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో వర్మ పాజిటివ్ ట్వీట్స్ కూడా చేశాడు. గతంలో కల్కి 2898 ఏడీ మూవీ గురించి… ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ.. విజువల్ వండర్ ఉందని స్పందించారు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ ట్రైలర్ మీద కూడా వర్మ స్పందించారు. వర్మ ఈ సినిమా గురించి వివరిస్తూ.. తన ట్విట్టర్‌లో ఆ ట్రైలర్‌ను షేర్ చేసి.. కొన్ని లైన్స్ రాసుకొచ్చారు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. అక్కడ కొన్ని పదాలను ఫిల్ చేయకుండా.. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ టైప్ లో వదిలేశారు. ఆ పదాలను సరిగ్గా ఎవరైతే ఫిల్ చేస్తారో వారికి లక్ష ఇస్తానంటూ ప్రకటించారు. దీనితో ఆ ట్వీట్ కింద కొంతమంది రకరకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వర్మ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక తాజాగా కల్కి సినిమా నుంచి విడుదల చేసిన.. సెకండ్ ట్రైలర్ చూసిన ఎవరైనా వావ్ అనకుండా ఉండలేరు. ఈ ట్రైలర్ లో చూపించిన విజువల్ వండర్స్, యాక్షన్ సిక్వెన్సులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చిన సీన్స్ అయితే అదిరిపోయాయి అని చెప్పి తీరాలి. ఇక ఇప్పటికే నార్త్ లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్స్ క్రాస్ చేసి.. బాగా బజ్ సంపాదించింది. కాబట్టి జూన్ 27న ఈ సినిమా ఖచ్చితంగా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందని… నిస్సందేహంగా చెప్పేయొచ్చు. మరి కల్కి సినిమాపై వర్మ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🔥🔥🔥 KALKI 2898 AD😘😘😘 యొక్క M_____F___ing P_____ L___ing A___ B____ing ట్రైలర్‌ను చూడండి
— రామ్ గోపాల్ వర్మ (@RGVzoomin) జూన్ 21, 2024