ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా.. స్టార్స్ గా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. కానీ, స్టార్ స్టేటస్ ను అలాగే కొనసాగించాలంటే..కాస్త బూస్టింగ్ ఇచ్చేందుకు ఫిల్మ్ బ్యాగ్రౌండ్ కూడా ఉండాలి. అది లేనిదో సినీ పరిశ్రమలో అంతగా గుర్తింపు ఉండదు. ముఖ్యంగా అభినయ అమ్మాయిలకైతే అందం, నయం, టాలెంట్ అన్నీ ఉన్నా.. అదృష్టంతో పాటు కాస్త సినీ నేపథ్యం కూడా తోడై ఉండాల్సిందే. కానీ, ఇలా సినీ వచ్చినవారు అందరూ ఈ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేరు. కేవలం కొంతమంది మాత్రమే నటులుగా ప్రశంసలు అందుకుంటారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..ఈమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే కథానాయికగా అంత మస్ ఫే కాలేదు కానీ, మెగాస్టార్ కు చిరంజీవికి చెల్లెలుగా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫోటో కనిపిస్తున్నఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఈమె మెగాస్టార్ కు చిరంజీవికి చెల్లెలుగా ఓ సినిమాలో నటించింది. ఇక ఆ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ అమ్మడు తెలుగులో చేసింది ఒక సినిమానే కానీ, ఈమె అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. తానే హీరోయిన్ ‘తాన్యా రవిచంద్రన్’. ఈమె ప్రముఖ నటుడు ‘రవిచంద్రన్’ మనవరాలు. కాగా, ఆయన నటన వారసత్వంలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ. ఇక ఈ విధంగానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీలో ఆయనకు చెల్లెలుగా నటించే అవకాశం దక్కింది. ఇక ఆ సినిమాలో నయనతారకు చెల్లిగా కనిపించింది తాన్య. ఇక ఈ సినిమాలో ఈ అమ్మడు అందం, నటనతో ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి మార్కులే కొట్టేసింది.
ఇకపోతే తాన్య మొదటగా.. పాలె విల్లయతేవా సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. కాగా, ఈ మూవీ 2017లో విడుదలై మంచి స్పందన వచ్చింది. అలాగే కథానాయికగా తాన్యాకు ఈ సినిమా మంచి పాపులారిటీ అందించింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ బృందావనం, కరుప్పన్, నెంచుకు నీతి, మాయోన్, అఖిలన్ వంటి హిట్ చిత్రాలలో నటించారు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన కరుప్పన్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే ఇన్ని సినిమాల్లో అలరించిన తాన్యాకు సరైన గుర్తింపు రాలేదు.
కాగా, ఇటీవలే తాన్యా రసవాది సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే ఇన్నాళ్లు హోమ్లీగా కనిపించిన తాన్య.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ లిమిట్స్ చేరుకుంది. ఇప్పుడిప్పుడే మోడ్రన్ లుక్ లో గ్లామర్ ఫోజులతో ఫాలోవర్స్ మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.. సోషల్ మీడియాలో అమ్మడి లుక్స్ చాలా బాగున్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాన్యా గ్లామర్స్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.