ఇప్పుడు తెలుగునాట ఏ ఇద్దరు కలిసినా ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఏంటి రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)పాజిటివ్ గా మాట్లాడాడా అని. పైగా ఇది కల కాదు కదా అని కూడా అనుకుంటున్నారు. వర్మ అంతలా ప్రతి ఒక్కరిని విమర్శించి అపఖ్యాహతిని మూటగొట్టుకున్నాడు. మరి పాజిటివ్ గా ఎవరి గురించి మాట్లాడాడో చూద్దాం.
రెబల్ స్టార్ ప్రభాస్ (ప్రభాస్)కల్కి (కల్కి 2898 ప్రకటన)రిలీజ్ ట్రైలర్ మొన్న విడుదలైంది. ప్రతి ఒక్కరు తమ కళ్ళు ఎంత భాగ్యానికి నోచుకున్నాయి అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎప్పుడెప్పుడు థియేటర్లలో ఫుల్ మూవీని చూస్తామా అంటే అతృతతో ఉన్నారు. ఇక వర్మ కి కూడా కల్కి చూడాలంటే కుతూహలం పెరిగిందనుకుంటా పాజిటివ్ గా కనిపించాడు. తన ట్విట్టర్‌లో ట్రైలర్‌ను షేర్ చేసి ఒక వండర్ అని పొగిడాడు. అంతటితో ఆగకుండా పజిల్‌గా కొన్ని పదాలను పెట్టాడు. అందులో కొన్ని లెటర్లను మిస్ చేశాడు. అది ముందుగా ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్లకి లక్ష రూపాయిలు ఇస్తానని చెప్తున్నాడు. మొత్తానికి వర్మ తన వంతుగా కల్కి ని ప్రమోట్ చేస్తున్నాడని అనుకోవచ్చు.
అన్నట్టు వర్మ మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్ కి ముందు వైసీపీ పార్టీ అధినేత జగన్ కి అనుకూలంగా వ్యూహం అనే మూవీని తెరకెక్కించాడు. అందులో చంద్రబాబునాయుడు(chandrababu naidu)పవన్(pawan kalyan)లోకేష్ (lokesh)లని చాలా దారుణంగా విమర్శించాడు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన అధికారంలో ఉంది. మరి రెడ్ బుక్ లో వర్మ ఉన్నాడో లేదో చూడాలి. రెడ్ బుక్ నుంచి తప్పించుకోవడానికే పాజిటివ్ దృక్పధంగా మాట్లాడుతున్నాడని అనేవాళ్లు కూడా లేక పోలేదు. ఇకపై పొలిటికల్ సినిమాలు తెరకెక్కించానని ఈ మధ్య స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం కొన్ని సినిమాలకి దర్సకత్వం చూపిస్తున్నాడు డైరెక్టర్ గా ప్రేక్షకుల దృష్టిలో చాలా బలమైన ముద్ర వేసుకున్నాడు. ఆ ఇమేజ్ ని చాలా కష్టపడి సంపాదించుకున్నాడు.