తెలుగు ప్రజల నవ్వులతో ముంచెత్తే కామెడీ షో జబర్దస్త్. ఈ షో వచ్చే టైం కి ఎన్ని పనులు ఉన్నా మానుకొని మరి టీవీ ల ముందు అతుక్కుపోతారు. సినిమా హీరోలు కూడా ఈ షో కి అభిమానులు గా ఉన్నారు.అంతటి కీర్తిని సంపాదించిన ఈ షో కి సంబంధించిన ఒక ఆర్టిస్ట్ మరణ వార్త అందరిలో విషాదాన్ని నింపుతుంది.
మహ్మద్దీన్..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం నందాతండా ఆయన స్వగ్రామం.. జబర్దస్త్ ప్రోగ్రాం లో దాదాపు 50 ఎపిసోడ్‌లు కనిపించాయి. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి సుపరిచయస్తుడే. హైదరాబాద్‌లో షూటింగ్‌తో.. ట్రైన్ ఎక్కేందుకు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు . కాకతీయ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌లో నుంచి ముందుకు కదులుతోంది.. ఆ సమయంలో ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే కాలు జారి కిందకు జారిపడటంతో ట్రైన్, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు చైన్ లాగడంతో లోకో పైలెట్ రైలును ఆపాడు
అక్కడికి చేరుకున్న రైల్వే పోలీసులు, సిబ్బంది.. మహ్మద్దీన్‌ను అతి కష్టం మీద బయటకు తీసి అంబులెన్స్‌లో కొత్తగూడెం జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. డాక్టర్లు చేసిన డాక్టర్లు.. మహ్మద్దీన్ నడుము, పక్కటెముకలకు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన వైద్యం ఖమ్మం తరలించాలని సూచించారు. వెంటనే తీసుకెళ్తుండగా.. మార్గం మధ్యలోనే తుదిశ్వాస విడిచాడు. అక్కడ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేశారు.మహ్మద్దీన్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.