ఓ తరం స్టార్ నటిమణుల్లో ఒకరు ఊర్వశి శారద. అచ్చ తెలుగు హీరోయిన్. అత్యధికంగా తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించింది. కన్నడ, హిందీ, తమిళ మూవీస్‌లో కూడా మెరిసింది. హీరోయిన్ రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటింది. ఆమె మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. భానుమతి తర్వాత అంతే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది ఈవిడే. ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. సెకండ్‌లో అక్క, వదిన, అమ్మ, అత్త వంటి పాత్రలు చేసి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు, రాజకీయ జీవితానికి దూరంగా బతుకుతుంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులోదే ఈ పిక్.
ఇందులో నటి శారద పక్కన.. చెడ్డీ వేసుకుని కూర్చున్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియన్ మాత్రమే కాదు గ్లోబల్ స్టార్. అత్యంత చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చి.. బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టాడు. అతడి రాకే ఓ ప్రభంజనం.. నూనుగు మీసాలు కూడా రాని వయస్సులో రికార్డులను బద్దలు కొట్టాడు. సీనియర్ హీరోలకు కూడా సాధ్యం కాని రేర్ ఫీట్స్ సాధించి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. పేరు మోసిన ఫ్యామిలీ అయినా.. స్వయం కృషితో ఎదిగిన నటుడు. చిన్నతనం నుండే నటిస్తూ.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోగా మారాడు. ఇంతకు ఆ బాలుడు ఎవరంటే.. మ్యాన్ ఆఫ్ ది మాసెస్, అల్లరి రాముడు, నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సీనియర్ నటి శారద పక్కన కూర్చున్న ఈ పిల్లోడు మన జూనియర్ ఎన్టీఆరే.
బ్రహ్మర్షి విశ్వామిత్ర, రామాయణం చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసిన తారక్.. 18 ఏళ్ల ప్రాయంలో నిన్ను చూడాలని మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో తొలి హిట్ అందుకున్నాడు. ఆదితో రికార్డులు తిరగరాశాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. సూపర్ హిట్స్ అందుకున్నాడు. రాఖీ తర్వాత పూర్తిగా లుక్ మార్చేశాడు యంగ్ టైగర్. ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టి సన్నగా మారాడు. యమదొంగ నుండి దేవర వరకు అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. కొన్ని మూవీలు అక్కడక్కడ తడబడ్డా నిలబడ్డాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా మాత్రమే కాదు.. గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం దేవరతో పాటు వార్ 2 చిత్రాలను షురూ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలాగే ప్రశాంత్ నీల్ వర్మతో కలిసి డ్రాగన్ (టైటిల్ పరిశీలనలో ఉంది) మూవీ చేయబోతున్నాడు. దేవర సెప్టెంబర్ 27న విడుదల అనుమతి.