క్రమంగా వారే హీరోలుగా , హీరోయిన్స్ గా వెండి తెరపై కనిపిస్తూ ఉంటారు . ఈ ముందునే వచ్చిన కేరింత సినిమా అందరిని ఎంతో మెప్పించింది. ఇక ఈ సినిమాలో ఒసేయ్ భావన అంటూ శ్రీకాకుళం భాషలో అందరి నవ్వించిన నటుడు గుర్తున్నాడా.. అతనే పార్వతీశం. ఇక ఇప్పుడు ఈ నటుడు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “మార్కెట్ మహాలక్ష్మి”. ఈ సినిమాలో పార్వతీశం కు జోడిగా ప్రణీకాన్వీకా నటించింది. థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రావచ్చు. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లోకి రానుంది అనే విషయాలు చూసేద్దాం.
మార్కెట్ మహాలక్ష్మి చిత్రానికి ఎస్ ముఖేష్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఓ క్లాస్ అబ్బాయికి, ఓ మాస్ అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథే ఈ సినిమా. ప్రేమ పెళ్లి లాంటి విషయాల మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఇటువంటి ప్లాట్‌లో వచ్చే సినిమాలన్నీ కూడా ఒకే తరహాలో కొనసాగినా.. దర్శకుడు కథను ముందుకు తీసుకుని వెళ్లే తీరుపైనే సినిమా ఉంటుంది. ఇక ఈ సినిమాలో పెళ్లి విషయంలో యువత ఎలాంటి ఆలోచనలతో ఉంది అనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీ ప్లాట్ ఫారమ్ ఆహాలో స్ట్రీమింగ్ కా సమాచారం. థియేటర్ లో సక్సెస్ కాలేకపోయింది కాబట్టి కనీసం ఓటీ లో అయినా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి.
ఇక మార్కెట్ మహాలక్ష్మి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఇండిపెండెంట్ బ్రతికే అమ్మాయి తనకు భార్యగా రావాలని ఎన్నో కలలు కంటూ ఉంటాడు. కానీ హీరో తండ్రి మాత్రం.. తనకు కట్నం ఇచ్చే పిల్లతోనే అతని పెళ్లి జరిపించాలని ఫిక్స్ అవుతాడు. ఈ హీరో ఓ రోజు మార్కెట్ లో కూరగాయలు అమ్ముతున్న.. మహాలక్ష్మి అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె ధైర్యం, ఆలోచనా విధానం అన్నీ నచ్చి తొలిచూపులోనే.. ఆమెతో ప్రేమలో పడతాడు హీరో. ఈ కోరికనే ఆమెకు ప్రపోజ్ కూడా చేస్తుంది. కానీ ఆమె మాత్రం ఇతని ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తుంది. ఆమె అతని ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేసింది ! మహాలక్ష్మి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి ! హీరో తండ్రి తన ప్రేమను ఒప్పుకుంటాడా లేదా ! ఈ స్టోరీ ఎలా ముందుకు సాగింది ! అన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.