యూట్యూబ్‌లో దొరికే కొన్ని సినిమాలు అత్యధిక వీక్షకాధారణ పొందుతున్నాయి. వాటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మరీ ఇంట్రస్ట్ గా ఉండటంతో వీటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారు యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉన్న ‘తలారి’ మూవీ చూసేయండి.
ఎం. శశికుమార్, నిఖిలా విమల్, నెపోలియన్, వేల రామమూర్తి, సుజా వరుణి, వోక్ సుందర్ నటించిన మూవీ ‘తలారి’. ప్రశాంత్ మురుగేశన్ సినిమాకి దర్శకత్వం వహించగా.. దర్బుక శివ సంగీతం అందించారు. ఈ మూవీ కథేంటో ఓసారి చూసేద్దాం.. తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉంటాడు. అది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అతడిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు. ఆ రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి ఆ ఏరియాకి పెద్ద రౌడీ. అతని పేరే సోమలింగమూర్తి. అతనికి ఊరంతా బంధువులే. అతనికి ఓ కొడుకు పట్టాభి. అయితే అతనికి నమ్మిన బంటు తలారి(శశికుమార్) ఉంటాడు. అతను ఉండగా సోమలింగమూర్తిని ఎవరూ టచ్ కూడా చేయలేరనేంతలా ఉంటుంది. అయితే సోమలింగమూర్తికి ఊర్లో కనపడని శత్రువులు కూడా ఉంటారు. కనపడే శత్రువులు ఉంటారు. మార్కెట్ సింహాచలం సోమలింగమూర్తిని ఎదిరించి మాట్లాడగా.. ఆ విషయం తెలుసుకున్న తలారి అతని ఇంట్లోకే వెళ్ళి నరికేస్తాడు. మరోవైపు భుజంగరావు అతని అన్నయ్య పద్మనాభం కలిసి ఊర్లో పెద్ద లావాదేవీలు జరుగుతున్నప్పుడు మధ్యలో చేరి సోమలింగమూర్తి పేరు చెప్పి బ్రోకరిజం చేస్తారు. ఆ విషయం సోమలింగమూర్తి, తలారికి తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. ఇక ప్రతీ పనిలో వారికి కమీషన్ కావాలని సోమలింగమూర్తితో భుజంగరావు కొంతమంది మనుషులని పెట్టించి చంపమని చెప్తాడు. అయితే వాళ్ళు తలారి, సోమలింగమూర్తిని కాకుండా అతని కొడుకు పట్టాభి వెంట పడతారు. ఇక ఆ తర్వాత తలారి కాపాడతాడు. అయితే కొన్ని అనుకొని పరిస్థితులలో సోమలింగమూర్తి కొడుకు పట్టాభి చనిపోతాడు. అతడెలా చనిపోయాడు? సోమలింగమూర్తి రక్తపు మడుగులో ఉండటానికి గల కారణమెవరు? అతని ఊర్లోనే కనపడని శత్రువులెవరు? తలారి నమ్మినబంటులా ఎందుకున్నాడనేది మిగిలిన కథ.
ఈ సినిమా స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఒక్కో ట్విస్ట్ కి కథనం మారిపోతుంది. అసలు క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరి ఊహకి అందదు. క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే వారు యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న ఈ సినిమాని చూసేయండి. ఏ అంచనాలు లేకుండా చూస్తే ఈ మూవీ మంచి థ్రిల్ ని ఇస్తుంది.