శరవణ స్టోర్స్ అధినేత అరుళ్ శరవణన్ గురించి కోలీవుడ్ ప్రేక్షకులకే కాదు.. టాలీవుడ్ మూవీ లవర్స్‌కు పరిచయం చేయనక్కర్లేదని పేరు. కోటీశ్వరుడైనా.. పెద్ద పెద్ద స్టార్లతో తన ప్రొడక్ట్‌లకు యాడ్స్ చేయించుకునే సత్తా ఉన్నా యాక్టింగ్ అంటే ఇష్టంతో అతడే నటిస్తాడు. హీరోయిన్లతో యాడ్ చేయించుకుంటాడు కానీ.. హీరో మాత్రం అతడే. ఎంతో మంది స్టార్ హీరోయిన్ల పక్కన ప్రకటనల్లో కనిపించాడు. సినిమాలంటే పిచ్చి, ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. అందుకే లేటు వయస్సులో హీరో అవతారమెత్తాడు. 51 ఏళ్లలో పెద్ద రిస్కే చేశాడు. ది లెజెండ్ పేరుతో పాన్ ఇండియా మూవీలో నటించాడు. స్వీయ నిర్మాణ రంగంలో ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో ఊర్వశి రౌతేలా, గీతిక తివారి హీరోయిన్స్. 2022లో వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
దీంతో ఆయన విపరీతంగా ట్రోల్స్‌కు ప్రయత్నించాడు. అవి పట్టించుకుంటే.. అతడు హీరో ఎందుకు అవుతాడు. ఇప్పుడు పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. గతంలో కూడా ఆయన సినిమా వస్తుందని అనుకున్నారు. అయితే ది లెజెండ్ రిలీజై రెండేళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రకటన రాలేదు. అంతలో ఇప్పుడు సినీ ప్రేక్షకులకు ట్విస్ట్ ఇచ్చి కొత్త మూవీని ఎనౌన్స్ చేశాడు. ఈసారి సరికొత్త మేకోవర్‌లో కనిపించాడు. ఇటీవల గరుడన్ మూవీతో హిట్ అందుకున్న ఆర్ఎస్ దొరై సెంథిల్ కుమార్‌తో మూవీ షురూ చేశాడు శరవణన్. ఈ సారి టోటల్ డిఫరెంట్ లుక్స్‌లో దర్శనమిస్తున్నాడు ఈ మిలినీయర్. మాస్ అండ్ రఫ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. మీసం, గెడ్డం పెంచి సీరియస్ రోల్ ట్రై కనిపిస్తోంది.
1970లో తమిళనాడులో జన్మించాడు శరవణన్. అసలు పేరు అరుళ్ శరవణన్. తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా నడుస్తున్న శరవణన్ స్టోర్స్ అధినేత. అరుళ్ తండ్రి పేరు సెల్వరత్నం. నెల్లై జిల్లా నుంచి చెన్నైకి వచ్చి టీ అమ్మకంతో మొదలుపెట్టి క్రమంగా శరవణ స్టోర్స్‌తో బిజినెస్ మెన్‌గా మారారు. ఈయన ఇద్దరు తమ్ముళ్లు కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళు. వయసొచ్చాక అరుళ్ శరవణన్ బాబాయ్ ల నుంచి వేరు పడి.. ది లెజెండ్ శరవణ పేరుతో కొత్త స్టోర్స్ మొదలుపెట్టారు. తక్కువ టైంలోనే వ్యాపారం వృద్ధి చెందింది. మొత్తం పది వేలకు పైగా ఉద్యోగులతో ఈ సంస్థ ఏడాది టర్నోవర్ ఏడు వందల మిలియన్ డాలర్లపైనే ఉంటుందట. అరుళ్ తన బ్రాండ్స్ కు అతడే బ్రాండ్ అంబాసిడర్. టాప్ హీరోయిన్లను తీసుకొచ్చి ప్రకటనలు చేయించి.. వారి పక్కన నటిస్తూ ఫేమస్ అయ్యాడు.