తెలుగు ఇండస్ట్రీలో నిత్యం ఎంతోమంది అందాల తారలు పరిచయం అవుతారు. అయితే వారిలో కొంతమంది వివిధ ఇండస్ట్రీలకు చెందిన అందాల ముద్దుగుమ్మలేక, తెలుగు హీరోయిన్లు కూడా ఉంటారు. పైగా వీరు ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో ఓవర్ నైట్ స్టార్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. కానీ, ఆ క్రేజ్ మాత్రం హీరోయిన్ గా సక్సెస్ అవ్వడంలో కాస్త వెనుకబడతారనే చెప్పవచ్చు. పైగా అందానికి అందం, చక్కని అభినయం, టాలెంట్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు కరువు. ఇక చేసిన ఒకటి, సినిమాలు కూడా అంతగా క్లిక్ అవ్వడం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోతారు.
అయితే అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ హీరోయిన్ కూడా. ప్రస్తుతం ఆ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో కనిపెట్టారా.. ఈమె టాలీవుడ్ లోని ఓ క్రేజీ హీరోయిన్. ఇక ఈమె అందానికి ఫిదా కానీ కుర్రాడు అంటూ ఉండడు. ఇంతకి పై ఫోటోలో తండ్రి పక్కన నిల్చొని నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. అయితే ఈమెను చూస్తే ఇప్పటికే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది కదా.. పైగా ఈ చిన్నది హీరోయిన్ గా చేసినవి ఒకటి రెండు సినిమాలే కానీ, ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇక ఆమె మరెవరో కాదు.. తెలుగు అందం ఈషా రెబ్బ. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే ఎక్కువ పలు సినిమాల్లో చిన్న చిన్నపాత్రల్లో నటించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలో హీరోయిన్ కు చెల్లెలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే పలు వెబ్ స్టోరిస్ లో కూడా ఈ చిన్నది నటిస్తుంది. అయితే అందానికి అందం, టాలెంట్ కూడా ఉన్నా హీరోయిన్ గా మాత్రం ఈమె సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతూ అడపాదడపా సినిమాలు చేస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే ఈషాకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ విధంగానే తరుచు తనకు సంబంధించిన గ్లామరస్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈషా చిన్నప్పుడు తన తండ్రితో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ ఫోటోను చూసి ఈషా రెబ్బ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం ఈషా రెబ్బ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.