ఇటీవల కాలంలో ఆన్ లైన్ మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాను బేస్ చేసుకుని, టార్గెట్ పర్సన్స్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. భయపెట్టి, వేరో ఆలోచన చేయకుండా మెల్లిగా నగదును తమ ఖాతాల్లోకి వేసుకుంటున్నారు. చివరకు చీటింగ్ చేస్తామని తెలిసి లబోదిబోమంటున్నారు. వీరి మోసాలకు సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం బలౌతున్నారు. తాజాగా టాలీవుడ్ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె సోషల్ మీడియా వేదికగా.. తనకు ఎదురైన భయంకరమైన మోసాన్ని అభిమానులు, ప్రజలతో పంచుకుంది. ఇంతకు ఆ నటి ఎవరంటే.. మల్లేశం, వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల.
సైబర్ నేరగాళ్ల నుండి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకుంది అనన్య. ‘ఈ రోజు మీకొక ఇంపార్టెన్స్ విషయం చెప్పాలనుకుంటున్నా. బిగ్ సీరియస్ ఇష్యూ. నాకు జరిగిన బాడ్ ఎక్స్ పీరియన్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నా. మూడు రోజుల క్రితం నాకు ఓ కస్టమర్ కేర్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే.. అవతలి వాళ్లు.. మీ నంబర్ ఓ రెండు గంటల పాటు బ్లాక్ చేస్తున్నాం. నాకు ముందు అర్థం కాలేదు. బ్లాక్ చేయడం ఏంటనీ అడిగితే.. తర్వాత డీటైల్స్ కోసం 9 నంబర్‌కు ప్రెస్ చేయండని అన్నారు. కస్టమర్ కేర్‌కు కనెక్ట్ అయ్యింది. అక్కడ ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ఈ నెల ఫిబ్రవరిలో మీ ఆధార్ నంబర్ ఉపయోగించి.. ముంబైలో ఓ సిమ్ తీసుకున్నారు. ఆ నంబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మనీలాండరింగ్ జరుగుతుంది అందుకే నంబర్ బ్లాక్ చేస్తున్నాం. మీకు ఇలాంటి ఇష్యూస్ రాకూడదు అనుకుంటే.. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి..పోలీసులు ప్రొవైడ్ ఉన్నట్లు చెప్పారు. నేను ఓకే అని చెప్పాను’. అని జరిగింది.
‘అనంతరం పోలీసులకు కాల్ కనెక్ట్ చేశాడు. మొత్తం ఏం జరిగిందో వాళ్లకు వివరించాను. ముంబయి పోలీస్ స్టేషన్‌కు రా అంటే..నేనుండేది హైదరాబాద్ అని చెప్పాను. స్కైప్ నుండి మీరు కనెక్ట్ అవ్వండి. మీకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. చెప్పినట్లే స్కైప్ నుండి వీడియో కాల్ చేయగానే.. మొబైల్ ఛార్జింగ్ ఉందా.. ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అంటూ ప్రశ్నించారు. అలాగే మాకు వీడియో కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు థర్డ్ పర్సన్ ఇంటరాక్షన్ ఉండకూడదు అని చెప్పాడు. సో వేరో రూంలోకి వెళ్లి కంప్లయింట్ ఇవ్వండి అని చెప్పాడు. ఏం జరిగిందో చెబుతాను అంటూ నా ఆధార్ నంబర్ తీసుకున్నాడు. నా ఆధార్ నంబర్ మీద ఏ నంబర్స్ ఉన్నాయో చెబుతాను అంటూ.. ఇతరులతో మాట్లాడినట్లు నటించాడు. ఈ ఆధార్ నంబర్‌తో 25 అకౌంట్లు ఉన్నాయని, మనీ లాండరింగ్, డ్రగ్ కేసు ఇన్వాల్వ్ అయ్యిందని భయపెట్టాడు. చూడండి పోలీస్ స్టేషన్‌లోనే ఉంది. 10 నిమిషాల తర్వాత వీడియో కాల్ ఆఫ్ చేశాడు. నువ్వెందుకు వారి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నావ్ అంటూ బెదిరించాడు. నేను లేడని చెప్పాను.
మీకు ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది. నీకు సేవ్ చేస్తాను అని చెప్పి.. పోలీస్ క్లియరెన్స్ ఇస్తాను అని మరొకరిని కనెక్ట్ చేశాడు. నేను నమ్మేలా కొన్ని డాక్యుమెంట్స్ పంపించారు. అంతలో నాకు డబ్బులు పంపు.. ఆర్బీఐ చూసుకుంటుంది. ఇది కరెక్ట్ ఎమౌంట్ కాదా అని చెప్పి.. ఓ థర్డ్ పార్టీ లింక్ పంపాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చి.. ఆర్బీఐ అన్నారు కదా. అనగానే.. మా పోలీసు డిపార్ట్ మెంట్ లో కూడా కొంత మంది అవినీతి పరులయ్యారు. వారికి తెలియకుండా ఇది చేస్తున్నామని చెప్పగానే.. డౌట్ వచ్చి.. గూగుల్ చేశాను. అప్పుడు స్కామ్స్ చాలా జరుగుతున్నాయని తెలిసింది. వెంటనే గట్టిగా మాట్లాడాను. అతడు కూడా పెద్దగా బెదిరించాడు. నేను పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నాను అనగానే కాల్ కట్ చేశాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. ఆడవాళ్లను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు’ అంటూ వాపోయింది. అచ్చ తెలుగు అమ్మాయైన అనన్యనాగళ్ల.. మల్లేశం, వకీల్ సాబ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం పొట్టేల్. త్వరలో విడుదల.