బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్‌లను కుదిపేస్తున్నాయి డ్రగ్ కేసులు. ప్రతి చోటా డ్రగ్ మాఫియా వేళ్లూనుకుంది. తాజాగా బెంగళూరు రైల్వే పార్టీలో సైతం భారీగా మదక ద్రవ్యాలు దొరికాయంటూ పోలీసులు. ఇందులో టాలీవుడ్ సీనియర్ నటి హేమ అరెస్టు అయ్యి.. బెయిల్‌పై రిలీజైన సంగతి విదితమే. ఇదిలా ఉంటే 2020లో శాండిల్ వుడ్‌లో సంచలనం రేపింది ఓ డ్రగ్ కేసు. కొంత మంది డ్రగ్స్ పెడ్లర్స్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ నటీమణుల పేర్లు బయటకు వచ్చాయి. వారి ఇంటికి సోదాలు కూడా చేపట్టారు. వారి రక్త నమూనాలను సేకరించి. పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్దారణ కావడంతో వారిని అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై శాండిల్ వుడ్ స్టార్ నటిమణులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది, నిర్మాత శివప్రకాష్ చిప్పి, వ్యాపారవేత్త ఆదిత్య అగర్వాల్ 2020 సెప్టెంబర్‌లో అరెస్టయ్యారు. ఆ తర్వాత జైలులో ఉన్న సంజన అనారోగ్య కారణాలతో డిసెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యింది. అయితే తమపై సీసీబీ పోలీసుల డ్రగ్స్ విభాగం వేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ సంజన, శివప్రకాష్‌లు బెంగళూరులోని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టు సింగిల్ సభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వీరిపై ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టు ఆదేశించింది. నటి సంజనా గల్రానీ, నిర్మాత శివప్రకాష్ చిప్పీలకు భారీ ఊరట లభించినట్లు అయ్యింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని కళ్యాణ నగర్‌లోని రాయల్ సూట్స్ హోటల్‌లో ప్రముఖులు, నటీనటులు, వ్యాపారవేత్తల డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న సమాచారం ప్రకారం 2020 ఆగస్టు 26న ఎన్‌సీబీ అధికారులు దాడులు చేశారు. అప్పట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు అనూప్, రవీంద్రన్, డి. అంకితం అనే డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేశారు. అనంతరం విచారణలో శాండల్ వుడ్ నటినటులకు డ్రగ్స్ సరఫరా ఉందని తేలింది. నటి సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది, నిర్మాత శివప్రకాష్ చిప్పిని అరెస్టు చేశారు. అలాగే బాలీవుడ్ ప్రముఖ హీరో వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య ఆల్వాను కూడా అరెస్టు చేశారు. కాగా, ఈ కేసులో ఆధారాలు లేవని, ఛార్జ్ షీట్‌లో కీలకమైన సాక్షులను సమర్పించినట్లు నిరూపించు ఎఫ్‌ఐఆర్ కొట్టిాలని తాజాగా కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.