యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు ఈ పేరుతో పాటు ఆయన నటించిన కల్కి 2898 ఏడీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ పై చూస్తామని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మరో రెండు రోజుల్లో డార్లింగ్ ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా అనగా జూన్ 27వ తేదీన గురువారం థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్. అయితే కల్కి సినిమాలో అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొన్, దిశా పటానీ, శాశ్వత ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అన్నాబెన్, శోభన వంటి స్టార్లు నటించిన సంగతి తెలిసిందే. లేకుంటే ఇప్పటికే ఈ మూవీకి చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చారు. మరోపక్క కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ గా ఉన్నా ప్రభాస్ మరో వైపు మంచు విష్ణు కన్నప్ప మూవీలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ఇటీవల విడుదలైన టీజర్ లో ప్రభాస్ కళ్లను మాత్రమే రివీల్ చేసిన సంగతి తెలిసిందే.అయితే కన్నప్ప ముందు ప్రభాస్ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడని ఎవరికైనా తెలుసా..? అది కూడా ప్రభాస్ బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో సినిమాలో నటించాడు. అదేంటి ప్రభాస్ బాలీవుడ్ లో అది కూడా స్టార్ హీరో సినిమాలో గెస్ట్ రోల్ అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమేనండి. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఆ సినిమా ఏదంటే..
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ హీరోగా.. ప్రభుదేవా తెరకెక్కించిన సినిమా యాక్షన్ జాక్సన్. కాగా, ఈ సినిమా 2014లో విడుదలైంది. ఇక ఈ మూవీలో అజయ్ ద్విపాత్రాభినయం చేయగా.. సోనాక్షి సిన్హా, యామీ గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. ఇందులో కునాల్ రాయ్ కపూర్, మనస్వి, ఆనందరాజ్ లు కూడా కీలకపాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో పంజాబీ మస్త్ అనే పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి ప్రభాస్ డాన్స్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమాలోని సాంగ్ వీడియోను షేర్ చేసి వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. అప్పట్లోనే ప్రభాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, అప్పటిలో ప్రభాస్ బాలీవుడ్ లోని గెస్ట్ రోల్ చేసిన సాంగ్ వైరల్ అవుతుండటం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.