యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898ఏడీ. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నట్లు కనిపించింది. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. జూన్ 27న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కల్కి2898 ఏడీ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు కాబోతున్నాయి. ఇదే సమయంలో టికెట్ రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచడానికి అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓ ప్రాంతంలో టికెట్ ధరలు వేలల్లో కనిపిస్తున్నాయి. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా కల్కి2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల అనుమతి. ఈ నేపథ్యంలోనే టికెట్ల ధరలు భారీగా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ లో ఈ టికెట్ ధరలు పెంచారు. మన తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా చూడాలంటే కనీసం 500 టికెట్లు ఖర్చుపెట్టాల్సిందే. అదే సింగిల్ థియేటర్స్ లో అయితే 200 నుంచి 300 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి మహా నగరాల్లో మల్టీప్లెక్స్‌లో విడుదల రోజు టికెట్ ధరలు వేలల్లో ఉంటాయి.
అలానే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కల్కి సినిమాకు కూడా టికెట్ ధర వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ముంబైలో రోజు రిలీజ్ మల్టీఫ్లెక్స్‌లో కల్కి సినిమా ఒక్కొక్కటి ధర రూ.200కి సంబంధించిన సమాచారం. అదే డ్రైవ్ ఇన్ థియేటర్స్ లో అయితే 3వేల రూపాయల వరకు ఉందట. ఇక పోతే ఢిల్లీ నగరంలో మల్టీప్లెక్స్‌లో 1300 నుంచి 2000 వరకు కల్కి2898 ఏడీ సినిమా టికెట్ ధరలు ఉన్నాయి. అదే విధంగా గ్రీన్ సిటీ బెంగళూరులో కల్కి విడుదల రోజు టికెట్స్ మల్టీప్లెక్స్‌లో 1100 నుండి 1500 వరకు ఉన్నాయి.
హైదరాబాద్ లో అయితే బెనిఫిట్ షోకి కొంతమంది 3వేలరూపాయలకు కల్కి టికెట్స్ బ్లాక్ లో అమ్మ వంటి టాక్ వినిపిస్తోంది. టికెట్ రేటు ఎంత ఉన్నా ప్రభాస్ మీద అభిమానంతో, కల్కి మీద ఉన్న అంచనాలతో అటు ఫ్యాన్స్ , ఇటు సినీ ప్రియులు టికెట్లు తెగ బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఓపెన్ చేసిన అన్ని థియేటర్స్ రిలీజ్ రోజు హౌస్ ఫుల్ చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న హైప్ చూస్తే కల్కి సినిమా కలెక్షన్స్ భారీగానే వస్తాయని అభిప్రాయపడుతున్నారు.