సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. తమ నటనతో మెస్మరైజ్ చేసే యంగ్ బ్లడ్ కి కొదవ లేదు. కానీ టాలెంట్ ఉన్నా కానీ రాక రాక అవకాశం వస్తే దాన్ని నిలబెట్టుకోవడంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. నెగిటివ్ రోల్స్ లో నటించిన ఈ నటుడికి రాక రాక హీరోగా అవకాశం వచ్చింది. అయితే మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి డబ్బులు లేవని ప్రేక్షకులు సహాయం చేయమని అడుగుతున్నారు. మీరు కార్తీ నటించిన ‘నా పేరు శివ’ సినిమా చూస్తే ఉంటారు. ఆ మూవీలో నెగిటివ్ క్యారెక్టర్ లో నలుగురు యువకులు నటిస్తారు. వారిలో ఈ వినోద్ కిషన్ ఒకరు. ఇతని యాక్టింగ్ అందులో చూసే ఉంటారు.
ఒకప్పుడు పాత సినిమాల్లో విలన్స్ ని చూస్తే అప్పటి తరం వాళ్ళు ఎంత కసిగా పళ్ళు కొరుక్కుని.. తిట్టుకునేవారో ఈ మూవీలో నెగెటివ్ రోల్ లో నటించిన వినోద్ కిషన్ ని కూడా చూసినప్పుడు అలానే కోప్పడతారు. అంతలా నెగిటివ్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయి నటించిన వినోద్ కిషన్.. ఇటీవల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా నటించారు. అయితే మొదటిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. పేకమేడలు అనే సినిమాలో నటించారు. అయితే మూవీ ప్రమోషన్స్ కోసం తన దగ్గర డబ్బులు లేవని.. సహాయం చేయండి అంటూ వేడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో వినోద్ కిషన్ మాట్లాడుతూ.. ‘హాయ్ అండి.. నా పేరు వినోద్ కిషన్. ‘నా పేరు శివ’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నెగిటివ్ రోల్స్. తెలుగులో తొలిసారిగా హీరోగా పేకమేడలు అనే సినిమాలో నటించాను. లక్ష్మణ్ అనే ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ నాది. సినిమా చాలా బాగా. సినిమా రిజల్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా. అయితే మూవీ ప్రమోషన్ కోసం డబ్బులు. 5 రూపాయలు, పది రూపాయలు ఎంతైనా ఈ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసి పంపించండి. ప్లీజ్ హెల్ప్ మి. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. హిట్ అయ్యాక వచ్చిన లాభాల నుంచి వడ్డీతో కలిపి మీ డబ్బులు మీకు ఇస్తా’ అంటూ ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేశారు. ఇక పేకమేడలు సినిమా విషయానికొస్తే.. ఈ మూవీలో వినోద్ కిషన్ సరసన అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి నీలగిరి నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూలై నెలలో రిలీజ్.