ఇండస్ట్రీలో ఓ వైపు పెళ్లి వార్తలు వినిపిస్తుంటే.. మరో వైపు వెండితెర, బుల్లితెరపై రాణిస్తున్న ప్రముఖుల విడాకుల న్యూస్‌లు హల్ చల్ చేస్తున్నాయి. సమంత, నాగ చైతన్య డివోర్స్ వార్తలను ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. అంతలో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల వరుసగా విడాకులు కలకలం రేపుతున్నాయి. ధనుష్-ఐశ్వర్య విడాకులు తీసుకున్నామంటూ ఎనౌన్స్ చేశారు. అలాగే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్.. తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అంతలో మరో స్టార్ కపుల్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. భార్యా భర్తలిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల నుండి కొన్ని ఫోటోలు తీయడమే అందుకు కారణమైంది.
ఇంతకు ఆ స్టార్ కపుల్స్ ఎవరంటే.. జయం రవి అండ్ ఆయన భార్య ఆరతి. వీరిద్దరూ ఎప్పటి నుండో విడాకులు తీసుకోబోతున్నారట సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. కొంత మంది ఈ రూమర్స్ తోసిపుచ్చారు. తాజాగా రవి తన ఇన్ స్టా ఖాతా నుండి భార్య ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు తీయడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. ఇతర ఆరతి కూడా కొన్ని తన ఇన్ స్టాల్ ఖాతాల నుండి తొలగించడంతో దాదాపుగా ఈ ఇద్దరు డివోర్స్ తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆరతిని 2009లో వివాహం చేసుకున్నాడు జయం రవి. తమిళంలో ప్రముఖ నిర్మాత సుజాత విజయ్ కుమార్ కూతురే ఆరతి. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. .
వారిలో ఆరవ ఇటీవల టిక్ టిక్ టిక్ అనే సినిమాలో నటించాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో రవి, ఆరతి జంట క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకుంది. కానీ కొన్నాళ్ల నుండి విబేధాలు జరుగుతున్నాయని, కొన్ని రోజుల నుండి వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు బెడిసికొట్టాయని సమాచారం. దీంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని మీడియా కోడై కూస్తోంది. అంతలోనే రవి, ఆరతి సోషల్ మీడియా నుండి ఫోటోలు తొలగించడంతో ఈ రూమర్లను నిజం చేసింది. ఇప్పుడు వీరి చర్యతో తమిళ సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. త్వరలో ఈ ఇద్దరు విడాకులు తీసుకోవడం కన్ఫమ్ అంటున్నారు. ఈ గాసిప్స్‌కు చెక్ పడే అవకాశం లేదు.