తెలుగు సినిమా లవర్స్ కి పండగ మొదలైంది. అటు థియేటర్లలో ప్రభాస్ ‘కల్కి’ మూవీ రిలీజ్ అయిన సినీలవర్స్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఉన్నారు. అయితే అందరికి టికెట్లు దొరకవు కాబట్టి కొందరు ఓటీలోకి వచ్చే సినిమాల కోసం చూస్తారు. వారికోసం మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.
పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ గురువాయుర్ అంబలనాదయిల్ ‘. ఈ మూవీ కేరళలో మే16 థియేటర్లలో విడుదలైంది. అక్కడ ఈ మూవీ భారీ హిట్ గా నిలిచి దాదాపుగా 90 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ దర్శకుడు విపిన్ దాస్. బాసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగి బాబు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన ‘పృథ్విరాజ్ సుకుమారన్’ . తన మలయాళ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజు (జూన్ 27) స్ట్రీమింగ్ సంస్థ. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయనున్నారు. కల్కి మూవీ టికెట్లు దొరకని వారు ఈ మూవీని ఓటీటీలో చూసేయండి.