పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ ‘కల్కి 2898ఎడి’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సూపర్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వసూలు చేసి విజయపథంలో దూసుకుపోతోంది. ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపిక పదుకొనే వంటి భారీ తారాగణం సినిమాకి ఓ భారీ లుక్‌ని తీసుకొచ్చారు. అంతేకాదు, ఈ సినిమాలో అర్జునుడి పాత్రలో విజయ్‌దేవరకొండ కనిపించడం అందర్నీ ఆకట్టుకుంది. నాగ్అశ్విన్ తొలిచిత్రం ‘ఎవడే సుబ్రమణ్యం’, ఆ తర్వాత ‘మహానటి’ చిత్రాలలో విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కల్కి’లో కూడా ఓ పాత్ర పోషించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
విజయ్ కొందరు క్యారెక్టర్ని అప్రిషియేట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఎప్పటిలాగే బాగాలేదని, అర్జునుడు అతను సూట్ అవ్వలేదని కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల ‘కల్కి’ సినిమా చూసిన విజయ్ దేవరకొండ సినిమా గురించి తర్వాత కూడా..
‘ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. సినిమా ఎంతో ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ చూశాను. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇండియన్ సినిమా రేంజ్ పెరిగి మరో స్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో అర్జునుడిగా ఒక కేమియో చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నాగి, ప్రభాస్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరి కోసమే ఆ పాత్రను చేశాను. సినిమా చూసినవారు ఆ పాత్ర ప్రభాస్‌ను సవాల్ చేసేలా ఉందని అంటున్నారు. కానీ, ఆయన కర్ణుడు, నేను అర్జునుడ్ని. అంతవరకే చూడాలి. నాగి యూనివర్స్‌లో మేం క్యారెక్టర్స్ చేస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు. నాగి ప్రతి సినిమాలో చేస్తున్నాను కాబట్టి నన్ను లక్కీ ఛార్మ్ అంటున్నారు. కానీ, అది కరెక్ట్ కాదు. సినిమా బాగుంటేనే అందరూ చూస్తారు. నేను ఆ సినిమాల్లో చేస్తే ఎలా హిట్ అవుతాయి. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. కల్కి పార్ట్2లో నా పాత్ర ఎక్కువ అని నిర్మాత చెప్పారని అందరూ నన్ను అడుగుతున్నారు. కానీ, ఆ సంస్థ నిర్మాత అశ్వినీదత్గారిని అడిగితేనే తెలుస్తుంది’ అన్నారు.