తెలుగు సినిమాని క్వాలిటీ పరంగా మేకింగ్ పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నించే దర్శకుల్లో గుణశేఖర్(గుణశేఖర్)కూడా ఒకడు. రామాయణం, చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి, శాకుంతలం లాంటి విభిన్న చిత్రాలే అందుకు ఉదాహరణ. కథ కి తగ్గ టేకింగ్ తో తన కంటూ సొంతంగా అభిమానులని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు లేటెస్ట్ గా యుఫోరియా తో రాబోతున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.
కొన్ని రోజుల క్రితం యుఫోరియా(euphoria)అనే నూతన తెర కెక్కించబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రక టించిన విషయం అందరికి తెలిసిందే. అయితే హీరో, హీరోయిన్ ఎవరనే విషయాన్నీ మాత్రం వెల్లడి చేయలేదు. వాళ్లనే కాదు మిగిలిన నటి నటుల వివరాలు కూడా వెల్లడి చేయలేదు.దీంతో కొన్ని రోజుల తర్వాత అయినా హీరో పేరు అనౌన్స్ చేస్తాడని అందరు భావించారు. అక్కడుంది గుణశేఖర్ కాబట్టి కొంత మంది హీరోల అభిమానులు అయితే తమ హీరో ఉంటాడేమో అని కూడా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవరి పేర్లు అనౌన్స్ చెయ్యకుండానే గుణశేఖర్ షూటింగ్ ప్రారంభించాడు. ఈ రోజు పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలయ్యింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసాడు.ఆస్కార్ అవార్డు గ్రహీత కాల భైరవ సంగీతం అందిస్తుండగా, గుణ హ్యాండ్ మేడ్ పై నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది.
ఇక ఇప్పుడు ఈ మూవీ న్యూస్ వైరల్ గా మారింది. ఎందుకంటే ఇండియన్ సినిమా చరిత్రలో నటి నటులు ఎవరో చెప్పకుండా సినిమాని స్టార్ చేసింది గుణ శేఖర్ అని చెప్పుకోవచ్చు. పైగా ఫస్ట్ నుంచి కూడా మొండి పట్టుదలకి మారుపేరైన గుణ శేఖర్ అసలు నటి నటులు లేకుండా తెరకెక్కించినా తెరక్కిస్తాడని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా భారీ తారగణమే యుఫోరియా లో కనపడనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.టైటిల్ విషయంలో కూడా అందరిలో క్యూరియాసిటీ నెలకొని ఉంది. శాకుంతలం ప్లాప్ తో యుఫోరియా ని గుణ శేఖర్ కసిగా తెరక్కిస్తాడనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.