స్వర్గీయ నందమూరి తారకరామారావు పెట్టిన పేరుతో సినిమా రంగంలో నలభై ఏళ్ళకి పైగా రాణిస్తూ వస్తున్న రచయితలు పరుచూరి బ్రదర్స్. 350 కి పైగా సినిమాలు వాళ్ళ కలం నుంచి వచ్చాయి. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక రికార్డు అని చెప్పవచ్చు. తాజాగా పరుచూరి బ్రదర్స్ (paruchuri brothers)లో ఒకరైన పరుచూరి గోపాల కృష్ణ (gopala krishna) పవన్(pawan kalyan)పై చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ చాలా కీలకంగా వ్యవహరించాడు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న రాజకీయనాయకుడులా చాలా ఎత్తుగడలు వేసాడు. చివరకి ఎన్నో సవాళ్ళని ఎదుర్కొని మానసిక బలంతో ముందుకు వెళ్తాడు విజయం సాధించాడు. అంతే కాకుండా తన పార్టీ ద్వారా పోటీ చేసిన అందర్నీ గెలిపించుకొని చరిత్ర సృష్టించాడు.దీంతో ఇన్ని రోజులు నేను మాట్లాడింది సినిమా డైలాగ్ లు కాదని నిరూపించాడు. ఇక పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన క్షణంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యాను.ఈ మేరకు స్వీకారం చేస్తుంటే కళ్ళార్పకుండా అలాగే చూస్తుండిపోయాను. చిన్న పిల్లాడు ఎంత ఎదిగిపోయాడని అనిపించింది. రాజకీయాల్లో పవన్ ఇంకా ఎదగాలి. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే మనస్తత్వం.
అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎంతో హుందాగా ప్రవర్తిస్తున్నాడు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ఏ రాజకీయ నాయకుడు జీవితం అయిన దెబ్బతింటుంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. చంద్రబాబు, పవన్ లు ఒకరు రాముడు అయితే ఇంకొకరు లక్ష్మణుడు. అదే విధంగా అవసరమైనప్పుడు కృష్ణార్జునులు లాగ కూడా ఉండాలి. అప్పుడే రాష్టం అభివృద్ధి ప్రధాన నడుస్తుందని చెప్పాడు, ఇదే విధంగా పవన్ సినీ జీవితం పై కూడా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసాడు. సినిమాలు చెయ్యడం మాత్రం మానుకోకూడదు. గతంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేసారు. . ఈ విషయంలో ఎన్టీఆర్ ని పవన్ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అలాగే అత్తారింటి దారేది లాంటి మూవీ పవన్ మళ్ళీ చెయ్యాలి. విఎఫ్ఎక్స్ లు, పెద్ద పెద్ద ఫైట్స్ అక్కర్లేదు. పవన్ స్క్రీన్ మీద కనపడి చిన్నపాటి డైలాగ్స్ చెప్తే చాలు. సినిమా హిట్. అదే విధంగా సినిమా రంగ సమస్యలని కూడా తీర్చాలని కోరుకుంటున్నాను..పవన్ కి నేను వీరాభిమానిని అని కూడా చెప్పాడు.