తెలుగు సినిమాకి ఒక కొత్త తరహా డాన్స్ మూమెంట్స్ ని పరిచయం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master)పాన్ ఇండియా లెవల్లో ఉన్న హీరోలకి, హీరోల అభిమానులకి ఫేవరేట్ మాస్టర్ కూడా. ఇటీవల తన పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన వెల్లడి చేసిన ఒక న్యూస్ తోటి డాన్సర్స్ లో ఆనందాన్ని తెస్తుంది.
జానీ మాస్టర్ కి తన పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan)నుంచి పిలుపు వచ్చింది. దీంతో చరణ్ ఇంటికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి (చిరంజీవి)కూడా ఉన్నారు. దీంతో జానీ మాస్టర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిరంజీకి దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత చరణ్, ఉపాసన (ఉపాసన)తో కలిసి ఫోటో కూడా దిగాడు. ఈ సందర్భంగా ఆ నుంచి జానీ మాస్టర్ కి ఒక ఇద్దరి హామీ వచ్చింది. డ్యాన్సర్స్ యునియన్ టిఎఫ్ టిటిడిఎ లో ఉన్న ఐదువందల కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా చూస్తామని మాటిచ్చారు. జానీ మాస్టర్ గతంలోనే ఈ విషయాన్నీ చరణ్ దృష్టికి తీసుకొచ్చాడు. ఇప్పుడు బర్తడే కానుకకి ప్రకటించినట్లయ్యింది.
ఇక ఈ విషయంపై జానీ మాస్టర్ మాట్లాడటం అడిగిన సహాయాన్ని గుర్తుపెట్టుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తుంది, మా కుటుంబాన్ని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనస్సులో ఎప్పుడు కృతజ్ఞతా భావం.అదే విధంగా అందరి తరపున చరణ్ అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. వదిన నాకు ప్రత్యేకంగా ఇచ్చిన మాటకి నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగిందని చెప్పుకొచ్చాడు.