మూవీ : తీరా కాదల్
నటీనటులు: జై, ఐశ్వర్య రాజేశ్ , శివద, వృధ్ది విశాల్, అమ్జత్ ఖాన్
ఎడిటింగ్: ప్రసన్న
సంగీతం: సిద్దూ కుమార్
సినిమాటోగ్రఫీ: రవివర్మన్
నిర్మాతలు: సుభాస్కరణ్
దర్శకత్వం: రోహిణ్ వెంకటేశన్
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్
కథ:
గౌతమ్ (జై) చెన్నైలో ఒక సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య వందన (శివద) కూతురు ఆర్తి ఇదీ అతని కుటుంబం. వందన ఒక హెచ్ ఆర్ మేనేజర్ గా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఎలాంటి సమస్య లేకుండా వారి జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఒకసారి అతను కంపెనీ పనిమీద మంగుళూరు బయల్దేరతాడు. ట్రైన్ లో అతనికి శరణ్య (ఐశ్వర్య రాజేశ్) తారసపడుతుంది. కాస్త ఇబ్బంది పడుతూనే ఒకరినొకరు పలకరించుకుంటారు. తన భార్య పిల్లలను గురించి గౌతమ్, తన భర్త ప్రకాశ్ గురించి శరణ్య ఒకరికొకరు చెప్పుకుంటారు. మంగుళూరు వెళ్లిన తరువాత కూడా ఇద్దరూ కలుసుకోవడం .. మాట్లాడుకోవడం .. కలిసి భోజనం చేయడం. అలా ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా మసలుకోవడం మొదలుపెడతారు. మంగుళూరు నుంచి చెన్నై కి వచ్చిన తరువాత కూడా గౌతమ్ ను శరణ్య మరిచిపోలేకపోతుంది. తన భర్త నుంచి విడిపోయి, గౌతమ్ ఫ్లాట్ కి ఎదురుగా ఉంటే ఫ్లాట్ లో దిగుతుంది. గౌతమ్ ఇంట్లో ఉన్నా .. ఆఫీసులో తరచూ కాల్ చేసి అతణ్ణి టెన్షన్ పెడుతూ ఉంటుంది. తన భార్య వందనకు తెలిస్తే ఏమౌతుందోనని గౌతమ్ సతమతమవుతూ ఉంటాడు. ఆమెకి అనుమానం రాకండ ఉండటం కోసం నానా తంటాలు పడుతుంటాడు. కొన్ని రోజులకి వందనని వదిలేసి రమ్మని గౌతమ్ తో శరణ్య అంటుంది. అసలు శరణ్య, గౌతమ్ ల మధ్య రిలేషన్ ఏంటి? ఆమె మాట విని వందనని వదిలేశాడా లేదా గౌతమ్ అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి లైఫ్‌లో కీలకం.. పెళ్లి ముందు వరకు ఎవరినో ఒకరిని ప్రేమించినా పెళ్లి తర్వాత మర్చిపోయి హ్యాపీగా ఉంటే ఒకే కానీ అలా లేకుండా భర్త హింసిస్తున్నాడనో, భార్య టార్చర్ చూపిస్తే హింసిస్తున్నాడనో, మాజీ ప్రేమికుడు వెతుక్కు వెళితే ఏం జరుగుతుందో ‘తీరా కాదల్’ మూవీ చూస్తే అర్థమవుతుంది.
దర్శకుడు రోహిణ్ వెంకటేశన్ ఏం చెప్పాలనుకున్నాడో దానిని చక్కగా చెప్పేశాడు. ఎక్కడ ల్యాగ్ లేకుండా, సున్నితమైన సంభాషణలతో కథని గ్రిస్పింగ్ గా మార్చాడు. మెయిన్ లీడ్ గా చేసిన ముగ్గురు చాలా సహజంగా నటించారు. వారికి తోడుగా లోకేషన్స్ కూడా కథకు సరిపోయాయి.
మెచుర్డ్ అండ్ ఫీల్ గుడ్ మూవీ జాబితాలో ఈ మూవీని చేర్చొచ్చు. కొన్ని ఫీల్ గుడ్ ఎమోషన్స్ బాగా ఉన్నాయి. ఫస్టాఫ్ టైం పాస్ అయ్యేలా వెళ్ళింది. కానీ సెకెంధాఫ్ లో ఒకే సీన్ రిపీట్ గా సాగుతున్నట్టు అనిపించింది. మళ్ళీ లాస్ట్ లో కన్ క్లూజన్ బాగుంది.
డైలాగ్స్ లో ఫ్రెష్ ఫీల్ ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడాల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫస్టాఫ్ లో కథని ప్రేక్షకుడికి అర్థం అయ్యేలా చేయడానికి పాత్రల పరిచయానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ కాస్త తొందరగా ముగిసినట్టుగా అనిపిస్తుంది. కుమార్ మ్యూజిక్ బాగుంది. ప్రసన్న ఎడిటింగ్ నీట్ గా ఉంది. రవివర్మన్ సినిమాటోగ్రఫీ మూవీకి ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
శరణ్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్, గౌతమ్ గా జై, వందనగా శివద సినిమాకి ప్రధాన బలంగా నిలిచారు. మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
ఫైనల్ గా: కొన్ని ఫీల్ గుడ్ ఎమోషన్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు.
రేటింగ్: 2.5 / 5
✍️. దాసరి మల్లేశ్