జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి(chiranjeevi)హీరోగా 1986 లో వచ్చిన మూవీ చంటబ్బాయ్. ఇందులో పొట్టి ప్రసాద్, శ్రీ లక్ష్మి మధ్య ఒక కామెడీ సీన్ ఉంటుంది. నేటికీ ఆ సీన్ ని యూ ట్యూబ్ లో చూసుకొని నవ్వుకునే వాళ్ళు లక్షల్లో ఉంటారు. తన మాటలు, చేష్టలు ద్వారా పొట్టి ప్రసాద్ మైండ్ ని శ్రీలక్ష్మి పోగొడుతుంది. దాంతో పొట్టి ప్రసాద్ పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. తాజ్ మహల్ ని ఎందుకు కట్టించాను, అశోకుడు ఆడుకోవడానికేగా, మరి రోనాల్డ్ రీగర్ అలా అంటాడేంటి, అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజమవుతుందా! ఏమో మరి మా అమ్మాయి ఝాన్సీ లక్షి బాయ్ ని, మా అబ్బాయి ఎస్ వి రంగారావు ని అడగాలి.. రిక్షాలో నా ఏనుగుని తీసుకువస్తే డాల్ఫీన్ హోటల్ లో టిఫీన్ చేసి కురుక్షేత్ర యుద్దానికి వెళ్ళాలి..ఇప్పుడు ఈ డైలాగ్స్ జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ (రాకింగ్ రాకేష్) పుణ్యమా అని తెలుగు ప్రజల నోటి వెంట వస్తుంది .
రోజా(రోజా)సినిమా హీరోయిన్ స్థాయి నుంచి మినిస్టర్ గా ఎదిగింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్య ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. కొన్ని రోజుల నుంచి ఆమె మీద పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం విషయంలో కుంభకోణం. వీఐపీ దర్శనం పేరుతో సామాన్యుల దగ్గర నుంచి రోజా భారీగా డబ్బులు వసూలు చేసింది. ఇందుకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పైగా అందుకు తగ్గట్టే వారంలో నాలుగు రోజులు కొండ మీదే ఉండేది. ఇప్పుడు ఈ విషయంపై రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోజా వైసీపీ దర్శనానికి వెళ్ళేది. తన లాగే ఇంకొంత మందికి స్వామి వారి దర్శనం కలిగించవచ్చనే ఉద్దేశ్యంతోనే. ఆమె పాటించే ఆ ఉన్నత విలువలు తెలియకుండా విమర్శిస్తున్నారు. ఉదయం లేవగానే రోజా దేవుడుతో మాట్లాడుతుంది. ఆమె తిట్టే బూతులు ఆమె స్థాయికి తగినవే.
రోజా నా తల్లి ,నేను తన కొడుకుని. ఎవరైనా నా తల్లి ని అంటే ఊరుకోనని చెప్తున్నాడు. రాకింగ్ రాకేష్ అనేక సినిమాల్లో కూడా నటించాడు.అతి త్వరలో కేసీఆర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కెసీఆర్ అంటే కేశవ చంద్ర రమావత్.