‘జాతిరత్నాలు’ సినిమాతో దర్శకుడు కె.వి. అనుదీప్ (KV Anudeep) పేరు తెలుగునాట ఒక్కసారిగా మారుమోగింది. నిజానికి అది అతనికి రెండో సినిమా. ‘పిట్టగోడ’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అనుదీప్. కానీ ఆ మూవీ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఆ తర్వాత “నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్” అంటూ నవ్వించడమే లక్ష్యంగా రూపొందించిన రెండో సినిమా ‘జాతిరత్నాలు’తో ఘన విజయాన్ని అందుకొని, అందరి దృష్టిని ఆకర్షించాడు. అనంతరం తమిళ హీరో శివకార్తికేయతో చేసిన ‘ప్రిన్స్’తో నిరాశపరిచిన అనుదీప్.. ఇప్పుడు దర్శకుడిగా తనో సినిమాని ఓ మాస్ హీరోగా చేయడానికి సిద్ధమవుతున్నాడు.
అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన ‘ప్రిన్స్’ విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇంతవరకు డైరెక్టర్ గా నాలుగో సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి మాస్ మహారాజ రవితేజ (రవితేజ)తో సినిమా చేసే అవకాశం అనుదీప్ కి వచ్చింది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (చిరంజీవి)ని డైరెక్ట్ చేసే అవకాశం ఉందని న్యూస్ వినిపించింది. కానీ దాని గురించి కూడా ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (విశ్వక్ సేన్)తో అనుదీప్ తన నెక్స్ట్ మూవీని చేయనున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇది కూడా అనుదీప్ మార్క్ లో సాగే అవుట్ అవుట్ ఎంటర్టైనర్ అని.