అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా.. ఆది మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)చెప్పే ఒక పవర్ ఫుల్ డైలాగ్. ఎన్టీఆర్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు తధాస్తు దేవతలు ఆ దగ్గరలోనే ఉండి ఉంటారు. అందుకే తన ప్రతి సినిమాకి పాత రికార్డులన్నింటిని అడ్డంగా నరికివేయడమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా ఆ డైలాగ్ కి ఇంకా వేడి తగ్గలేదని నిరూపితమైంది.
ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర(దేవర)ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఈ మూవీ కోసం ఎంతో ఆశతో ఉన్నారు. దేవర వస్తాడు మా ఆకలి తీరుస్తాడు అని గంపెడు ఆశతో ఉన్నాడు. మరి ఎన్టీఆర్ సినిమా వచ్చి టూ ఇయర్స్ అవుతుంది. ఇక ఇప్పుడు దేవరకి సంబంధించిన తాజా వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది దాంతో దేవర మీద అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దేవర బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. ముఖ్యంగా మాస్ ఏరియాస్ లో అయితే ట్రెమండరస్ బిజినెస్ ని చేసుకుంటుంది. కళ్ళు చెదిరిపోయే రేట్స్ కి బయ్యర్లు సొంతం చేసుకుంటున్నారు. అందులోనూ విపరీతమైన పోటీ కూడా ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ అంటేనే మ్యాన్ ఆఫ్ మాసెస్ కి బ్రాండ్ అంబాసిడర్. పైగా దేవర కూడా వీర మాస్ మూవీ. దీంతో మూవీ బాగుందని టాక్ వస్తే మాత్రం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం.
ఇక దేవర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (jahnvi kapoor)హీరోయిన్ గా చేస్తుంది. దాంతో ఆ ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్(saif ali khan)ప్రతి నాయకుడుగా చేస్తున్నాడు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకలతో కూడిన దేవర సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ డేట్ కి గతంలో ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటి బస్టర్ స్టూడెంట్ నంబర్ వన్ వచ్చి ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో రెండు భాగాలుగా దేవర తెరకెక్కుతుంది. కొరటాల శివ (koratala siva)దర్శకుడు కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా రూపొందాయి.