ప్రస్తుతం థియేటర్లలో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ (కల్కి 2898 AD) ప్రభంజనం కొనసాగుతోంది. అలాగే జూలై 12న కమల్ హాసన్ ‘ఇండియన్-2’ (ఇండియన్ 2) థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇక ఓటీటీలో కూడా ఈ వారం సినిమాల సందడి బాగానే ఉంది. సుధీర్ బాబు యాక్షన్ మూవీ ‘హరోం హర’ (హరోమ్ హర) జూలై 11 నుంచి రెండు ఓటీటీ వేదికలు ఈటీవీ విన్, ఆహా లోకి రానుంది. విజయ్ సేతుపతి 50వ చిత్రం ‘మహారాజ’ (మహారాజ) జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ సంస్థ. ఫహాద్ ఫాజిల్ ‘ధూమం’ మూవీ జూలై 11 నుంచి ఆహాలో అలరించనుంది. అలాగే ‘ఆరంభం’, ‘జిలేబి’ వంటి పలు సినిమాలు కూడా ఓటీటీలోకి అడుగు పెట్టనున్నాయి.
ఆహా:
హరోం హర మూవీ – జూలై 11
ధూమం మూవీ – జూలై 11
ఆరంభం మూవీ – జూలై 11
జిలేబి మూవీ – జూలై 13
ఈటీవీ విన్:
హరోం హర మూవీ – జూలై 11
నెట్ ఫ్లిక్స్:
మహారాజ మూవీ – జూలై 12
బ్లేమ్ ది గేమ్ మూవీ – జూలై 12
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
అగ్నిసాక్షి తెలుగు సిరీస్ – జూలై 12
సోనీ లివ్:
36 డేస్ వెబ్ సిరీస్ (హిందీ) – జూలై 12