కొన్ని థ్రిల్లర్ సినిమాలని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడగలరు. అలాంటి వారి కోసమే కొన్ని ఇతర భాషల్లో నిర్మించిన సినిమాలు తెలుగులోకి ఓటీటీలోకి వస్తున్నాయి.
ధాహన్(DAHAN) సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రదర్శించబడింది. ఇందులో రెండు భిన్నమైన కథలని మిక్స్ చేసి లింకప్ చేసారు. ఫస్టాఫ్ కాస్త స్లోగా సాగినా మధ్యలో వచ్చే ట్విస్ట్ లు థ్రిల్ ని పంచుతాయి. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉన్న ఈ సిరీస్ ఓ ఐఎస్ ఆఫీసర్ మైనింగ్ పనులు చూసుకోవడానికి వస్తాడు. అయితే అక్కడ ఊరి చివర గుహలో రాక అనే రాక్షసి ఉంటుంది. ఆ ఊరి వాళ్ళంతా వారి దైవమని భావించి పూజలు చేస్తారు. దానిని డిస్టబ్ చేయకూడదని అంటారు. కానీ ఆ కొత్తగా వచ్చి ఐఏఎస్ అధికారి ఊరి ప్రజల మాట వినకుండా మైనింగ్ పనులు మొదలెడతారు. అప్పుడు అతనికి ఏం జరిగింది? అసలు నిజంగానే రాకా ఉందా? అది దెయ్యమా లేక జాంబీనా అనేది తెలియాలంటే ధాహన్ చూడాల్సిందే.
వన్ ఆఫ్ ది బెస్ట్ జాంబీ సిరీస్ లో కొనసాగుతున్న మరో సిరీస్ .. బేథాల్ (BETAAL). ఓ మారుమూల ప్రాంతంలో డెవెలప్‌మెంట్ అనేది ఉండదు. దానిని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ రోడ్డు, కరెంటు లాంటివి ఉండటానికి మరమ్మత్తులు చేస్తారు. అయితే అక్కడ ఓ గుహా ఉంటుంది. దానిని కూడా లేపేద్దని చూస్తుండగానే అక్కడికి కొందరు వస్తారు. వారిని క్లియర్ చేద్దామని అనుకుంటారు. కానీ వారికి అనుకోకుండా ఒకటి దొరుకుతుంది. దానివల్ల వారి చుట్టుపక్కల వాళ్ళకి ఏం జరిగింది? అసలు వాళ్ళు ఆ గుహని తీసేశారా లేదా అనేది ఫుల్ ఎంగేజింగ్ గా సాగుతుంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగే ఈ సిరీస్ అత్యధిక రేటింగ్‌తో దూసుకెళ్తుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
డైవర్స్ తీసుకున్న సీకు అనే అతను.. తన కూతురు బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి బూసాన్ కి ట్రైన్ లో వెళ్తాడు. ట్రైన్ లో అందరు కలిసి ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ హ్యాపీగా ఉంటారు. అయితే వారికి తెలియకుండా ట్రైన్ లోకి వైరస్ సోకిన ఓ మహిళ ఎంటర్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? తన కూతురిని బూసాన్ తీసుకెళ్ళాడా లేదా అనేది తెలియాలంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ చూడాల్సిందే.
ది లాస్ట్ ఆఫ్ అజ్ ( THE LAST OF US)… మనుషులు జాంబీలుగా మారేది వైరస్ వల్లే కాదు ఫంగస్ వల్ల కూడా వస్తుందని చెప్తూ హెచ్‌బీఓ(HBO) వాళ్ళు తీసిన ఈ సిరీస్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్ కి ఈ సిరీస్ ఫీస్ట్ అని చెప్పాలి. యాక్షన్, అడ్వెంచర్, డ్రామాగా తెరకెక్కించిన ఈ సిరీస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటాయి. హెచ్‌బీఓ నుండి జియో సినిమాకి తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి థ్రిల్ ని ఇస్తుంది.