ఆడు హీరోయిన్‌టైన్‌మెంట్ బ్యానర్ పై మాళ్వి మల్హోత్రా నర్తించిన స్పెషల్ సాంగ్ “షాబానో” డివో మ్యూజిక్ ద్వారా విడుదలైంది. గౌతమ్ చవాన్ నిర్మాతగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో రూపొందించిన ఈ సాంగ్ కు యశ్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు.
సాంగ్ విడుదలైన తరువాత యువత నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో సాంగ్ వైరల్ అవ్వడమే కాకుండా యంగ్ స్టర్స్ రీల్స్ ఉండటం విశేషం. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ మెలోడిగా క్యాచీ లిరిక్స్ తో ఆకట్టుకుంటుంది.
టాలెంటెడ్ సింగర్ సాకేత్ కోమండూరి ఈ పాటకు తనదైన శైలిలో సంగీతం అందించారు. ఏ.డి మార్గల్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సాంగ్ కు శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ అలాగే ఆర్.మురళీమోహన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఆర్. చంద్రమోహన్ లైన్ ప్రొడ్యూసర్. షాబానో సాంగ్ తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైంది, అన్ని భాషల్లో ఈ సాంగ్ ను సోని కోమండూరి పాడడం జరిగింది. సోని కోమండూరి బాహుబలి సినిమాలో హంసనావ పాట పాడడం విశేషం.