కొన్ని సినిమాలు, సిరీస్ లు రిలీజ్ కి ముందే ఆసక్తిని పెంచుతాయి. ఎందుకంటే అవి ప్రస్తుతం వైరల్ అయి ఉంటాయి. అలా తమిళంలో రిలీజ్ అయి రాజకీయంగా చర్చకి దారితీసిన ఓ అడాల్డ్ మూవీ తెలుగు ఓటీటీలోకి రానుంది. అదేంటో ఓసారి చూసేద్దాం.
ఈ మార్చి ఏడాది 29 న ‘ తమిళ హాట్ స్పాట్ ‘ సినిమానాట థియేటర్లలో రిలీజైంది. కలైయరసన్, శాండీ మాస్టర్, ఆదిత్య, గౌరీ కిషన్, అమ్ము అభిరామి, జననీ అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించారు. విఘ్నేష్ కార్తిక్ ఈ సినిమాకి దర్శకుడు. సమాజంలో నిత్యం జరుగుతున్న కొన్ని అక్రమాలని, అన్యాయాలని చూసి పట్టించుకోకుండా ఉంటే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేది తెరకెక్కించగా.. వీటితో పాటు రాజకీయంగా సెటైరికల్ గా ఉండటంతో ఈ సినిమా వైరల్ కంటెంట్ మూవీ లిస్ట్‌లో చేర్చారు.
జూలై 17 నుండి ప్రముఖ ఓటీటీ వేదికపై ‘హాట్ స్పాట్’ స్ట్రీమింగ్ యాజమాన్యం. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ తో పాటు అసభ్య పదజాలం ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు చూడకూడదని సెన్సార్ బోర్డ్ వాళ్ళు దీనికి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఈ మూవీ తమిళనాట రిలీజ్ అయ్యాక పెద్ద చర్చ జరిగింది. మరి తెలుగులో రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.