ప్రభాస్, నాగ్ అశ్విన్ ‘కల్కి’ అనుకున్నది. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. భారీ బడ్జెట్‌తో చేసిన సినిమాకి పబ్లిసిటీ కూడా భారీగానే చేస్తారు. కానీ, దానికి భిన్నంగా కల్కి మేకర్స్ పబ్లిసిటీపై అంత శ్రద్ధ పెట్టలేదు. అయినా సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. కంటెంట్‌ని కంటెంట్‌పై, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. మూడో వారంలోకి ఎంటర్ అయినప్పటికీ కలెక్షన్ల జోరు తగ్గలేదు. అమెరికాలో ఇప్పటికే 17 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. ‘బాహుబలి 2’ అమెరికాలో 20 మిలియన్ డాలర్లు వసూలు చేసి తిరుగులేని రికార్డును క్రియేట్ చేసింది. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ‘కల్కి’ ఆ రికార్డును క్రాస్ చేసే దిశగా వెళుతోంది.
గత ఏడాది ఆరంభంలో రిలీజ్ అయిన షారూక్ ఖాన్ సినిమా ‘పఠాన్’ ఫుల్ రన్‌లో 1050 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ రికార్డుని ఇప్పుడు ‘కల్కి’ కేవలం 15 రోజుల్లోనే క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. గత ఏడాది మధ్యలో రిలీజ్ అయిన షారూక్ ఖాన్ సినిమా ‘జవాన్’ 1150 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇప్పుడు కల్కి దూకుడు చూస్తుంటే జవాన్ రికార్డును కూడా ఒకటి రెండు రోజుల్లో క్రాస్ చేస్తుందని ట్రేడ్‌వర్గాలు భావిస్తున్నాయి. ‘కల్కి’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అమితాబ్ ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్లపై తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ‘అమేజింగ్.. వావ్..’ అంటూ చెబుతున్నారు. ఇప్పుడున్న కలెక్షన్ ట్రెండ్ చూస్తుంటే ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డుని కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది.
పఠాన్ రికార్డును క్రాస్ చేసింది, జవాన్ కూడా త్వరలోనే దాటేస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఆర్ఆర్. అయితే వాస్తవానికి ఈ మూడు సినిమాల కంటే కంటెంట్‌పరంగా ఉండవచ్చు, మ్యూజిక్ పరంగా కావచ్చు కల్కి రేంజ్ తక్కువనే చెప్పాలి. కేవలం ప్రభాస్ ఛరిష్మా, నాగ్ అశ్విన్ టేకింగ్, టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ మెయిన్‌టెయిన్ చెయ్యడం స్థిరంగా ఇంత భారీ కలెక్షన్ రావడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్‌ని బట్టి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే లాంగ్ రన్ ఎన్ని వారాలు కొనసాగుతుందో, ఈ ఫిగర్స్ ఎక్కడి వరకు వెళ్లి ఆగుతాయో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.