వెబ్ సిరీస్ : 36 రోజులు
నటీనటులు: నేహా శర్మ, పురభ్ కోహ్లి, శృతిసేత్, షరీబ్ హష్మీ, చందన్ రాయ్ సన్యల్ జరిగింది
ఎడిటింగ్: అభిజిత్ దేశ్ పాండే
మ్యూజిక్: రోషిణ్ బాలు
సినిమాటోగ్రఫీ: క్వాయిస్ వశీఖ్
నిర్మాతలు: సమీర్ నయ్యర్, దీపక్ సెగల్
దర్శకత్వం: విశాల్ ఫురియా
ఓటీటీ: సోనిలివ్
ఓ హత్యతో కథ ఎలా మలుపు తిరిగిందనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో నేహాశర్మ నటించిన సిరీస్ ‘ 36 డేస్ ‘. మరి ఈ సిరీస్ మెప్పించిందా లేదా ఓసారి చూసేద్దాం.
కథ:
గోవా సముద్ర తీరంలోని ఓ హౌసింగ్ సొసైటీ. అది ధనవంతులు మాత్రమే ఉండే చోటు. ఇక తాము ధనవంతులమని చెప్పుకోవడానికి మరికొందరు అక్కడ అద్దెకి కూడా ఉంటారు. ఆ కాలనీలో రిషి (పూరబ్ కోహ్లీ), రాధిక (శృతి సేథ్) ఉంటారు. ఆ పక్కనే టోని (చందన్ రాయ్), అతని భార్య సియా (చాహత్) కూడా ఉంటారు. ఇక తాము కూడా ధనవంతులమని చెప్పుకోవడానికి తపించే లలిత (అమృత), ఆమె భర్త వినోద్ (షరీబ్ హష్మీ) కూడా అక్కడే ఉంటారు. ఇక బెనీ (షెర్నాజ్) ఆమె భర్త డెన్జీ, కొడుకు రియాద్ ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు.’ రిషి – రాధిక దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి. గతంలో రిషికి ఒక యువతితో ఎఫైర్ ఉండటం .. రాధికకి ఇది రెండో పెళ్లి కావడానికి కారణం. ఇక టోని విషయానికి వస్తే, అతను నోయల్ (శంకర్) అనే గ్యాంగ్ లీడర్ దగ్గర పనిచేస్తుంటాడు. ఆ నోయల్ కి చెందిన ‘క్యాసినో’ లో మేనేజర్ గా వినోద్ పనిచేస్తుంటాడు. ఇక అదే సొసైటీలోకి అందమైన పెళ్లి కానీ ఫరా(నేహా శర్మ) వస్తుంది. ఇక ఫరాను చూసిన రిషి, టోని అట్రాక్ట్. ఆమెకి వాళ్లిద్దరూ ఎక్కడ దగ్గరైపోతారోనని వినోద్ గమనిస్తాడు. ఫరా తరచూ మోహిత్ అనే యువకుడిని రహస్యంగా కలుసుకుని తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమె దారుణంగా హత్య చేయబడింది. అసలు ఆమెను హత్య చేసిందెవరు? అసలు ఫరా అక్కడికి ఎందుకు వచ్చిందనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఫరా హత్యతో కథలో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని కలిగించిన దర్శకుడు దానిని అన్ని ఎపిసోడ్లలో నిలబెట్టుకోలేకపోయాడు. ఎందుకంటే కథలోని పాత్రలు ఆడియన్స్ కి అర్థమవ్వడానికే రెండు ఎపిసోడ్ లు అయిపోతుంది.
ఫరా హత్యతో మొదలైన కథ.. ఆ హత్యకు 36 రోజుల ముందు నుంచి ఏం జరుగుతూ వచ్చిందనేది కౌంట్ డౌన్ గా చూపించడం బాగుంది. ఇక ఆ ఇన్వెస్టిగేషన్ లో ఫరా హత్య జరిగిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ, ఒక్కొక్క పాత్ర వైపు మనం అనుమానంగా చూస్తాం. అలాగే ఫరా నేపథ్యానికి సంబంధించిన కుతూహలం కూడా పెరుగుతుంటుంది. ఇలా అనేక కోణాలలో ఈ కథ ముందుకు వెళుతుంది.
సిరీస్ నిడివి కాస్త తగ్గితే బాగుండేది. నేగా శర్మ నటన సిరీస్ కి అదనపు బలాన్నిచ్చింది. ఓ హౌసింగ్ సొసైటీలో ఇల్లు ఒకే రకంగా ఉన్నా వారి మనసులు ఒకేలా ఉండవని చూపించడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు . అడల్ట్ సీన్లు ఉండటంతో ఫ్యామిలీతో కలిసి చూడలేం. అసభ్యకర పదజాలాన్ని ఎక్కువ వాడుకున్నాడు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి.
నటీనటుల పనితీరు:
ఫరా పాత్రలో నేహా శర్మ చాలా బలంగా నిలిచింది. నోయల్ గా శంకర్, రిషిగా పూరబ్ కోహ్లీ, రాధికగా శృతి సేథ్, టోనీగా చందన్ రాయ్ ఆకట్టుకున్నారు. ఇక మిగిలినవారు వారి పాత్రకు అనుగుణంగా నటించి మెప్పించారు.
ఫైనల్ గా..
నెమ్మిదిగా సాగే కథనం కాస్త నిరాశని కలిగించేలా భిన్నమైన కథలు ఇష్టపడేవారికి నచ్చే అవకాశం ఉంది.
రేటింగ్: 2.5/5
✍️. దాసరి మల్లేశ్