ఒక వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)ఇంకో వైపు కేజీఎఫ్(kgf)ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి(srinidhi shetty)ఈ ఇద్దరు పోటీ పడితే గెలుపు ఎవరి వైపు నిలబడుతుంది. పవన్ ఫ్యాన్స్ అయితే పవన్ గెలుస్తాడని అంటారు. శ్రీనిధి ఫ్యాన్స్ అయితే శ్రీనిధి గెలుస్తుంటాడని అంటారు. అంతకంటే ముందు అసలు ఈ డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది. పైగా ఎప్పుడు ఊహించని పేర్లని పక్కపక్కన చేర్చడానికి కారణం ఏంటని గూగుల్ ని కూడా సంప్రదిస్తారు. సో అసలు విషయం ఏంటో చూసేద్దాం.
పవన్ అప్ కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు (hariharaveeramallu)కూడా ఒకటి. పవన్ మొట్ట మొదటి సారిగా చేస్తున్న చారిత్రాత్మక మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో శ్రీనిధి మెరవబోతుందనే న్యూస్ ఒకటి నెత్తింట చక్కర్లు కొడుతుంది. పవన్ తో కలిసి ఒక సాంగ్ లో ఆడిపాడనుందని అంటున్నారు. చిత్ర బృందం అధికారంగా ప్రకటించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం చాలా వేగంగానే నయా న్యూస్ హోదాలో దూసుకుపోతుంది. ఈ న్యూస్ నిజం కావాలని ఇద్దరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కేజీఎఫ్ రెండు భాగాలతో శ్రీనిధి భారీ ఫాలోయింగ్ నే సంపాదించింది. డబ్బు, అధికారం కలగలిపిన రీనా అనే పొగరు గల అమ్మాయిగా సూపర్ పెర్ఫార్మ్ ని ఇచ్చింది.మరి హీరోయిన్స్ పొగరు ని దించడంలో స్పెషల్ అయిన పవన్ కళ్యాణ్ శ్రీనిధి ని సాంగ్ లో ఎలా ఆటపట్టిస్తాడని అనుకుంటున్నారు. అసలు ఆ కాంబోనే ఒక వండర్ అని చెప్పవచ్చు.
ఇక పవన్ అగస్టు నుంచి వీరమల్లు షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని చాలా రోజుల నుంచి వస్తున్న వార్తలు. ప్రొడ్యూసర్ ఏఎం రత్నం(am rathnam)అయితే పవన్ ఒక పదిహేను రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెప్పాడు. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా పలు తమిళ, తెలుగు చిత్రాలకి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ (జ్యోతి కృష్ణ)దర్శకత్వం వహిస్తున్నారు. కొంత భాగానికి దర్శకత్వం వహించిన క్రిష్ దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నాడు.ఇప్పటి వరకు పవన్ కెరీర్‌లో తెరకెక్కిన హై బడ్జట్‌తో వీరమల్లు రూపొందించబడింది.